య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌లో ముర‌ళీ శ‌ర్మ‌

Murali Sharma To Play Aluri Chakrapani in NTR Biopic, Murali Sharma as Filmmaker Aluri Chakrapani, NTR Biopic Cast, Actor Murali Sharma in Balakrishna Movie, NTR Biopic Latest Updates, Telugu FilmNagar, Telugu Cinema News, Latest Tollywood News, Telugu Film News
Murali Sharma to paly Aluri Chakrapani in Ntr biopic

మ‌హాన‌టుడు, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా ‘య‌న్‌.టి.ఆర్’ పేరుతో ఓ బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న ఈ సినిమాకి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాల‌కృష్ణ‌తో పాటు సాయి కొర్ర‌పాటి, విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న ఈ సినిమా  రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌ల ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఆలూరి చ‌క్ర‌పాణి పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ముర‌ళీ శ‌ర్మ న‌టిస్తున్నారు ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలియ‌జేశారు. అలాగే.. ఆ పాత్ర‌కు త‌న‌ను ఎంపిక చేసుకున్న త‌న ప్రియ మిత్రుడు క్రిష్‌కు కృత‌జ్ఞ‌త‌లు చేశారు.

కాగా.. ఎన్టీఆర్ శ్రీ‌మ‌తి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్‌, లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఎల్వీ ప్ర‌సాద్ పాత్ర‌లో బెంగాలీ న‌టుడు జిష్షు సేన్ గుప్తా న‌టిస్తున్న‌ట్లు అధికారిక వార్త‌లు వచ్చాయి.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here