డెహ్రాడున్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న మహేష్ సినిమా

Mahesh Babu 25th first schedule completed in Dehradun, Mahesh Babu 25th Film Shooting Update, #SSMB25, Mahesh 25 Movie Updates, #SSMB25 Movie Schedule, Mahesh Babu Upcoming Movie News, Mahesh Vamsi Paidipallu Movie, Telugu FilmNagar, Tollywood Cinema News, Latest Tollywood Updates,
Mahesh Babu 25th first schedule completed in Dehradun

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఉత్తరాది భామ పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మహేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ 25వ చిత్రం కావడంతో.. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. కాగా.. చిత్రీకరణలో భాగంగా తొలి షెడ్యూల్‌ను డెహ్రాడున్‌లో చిత్రీకరించారు. అక్కడ ఒక కాలేజీలో మహేష్‌, పూజతో పాటు కీలక పాత్రధారి ‘అల్లరి’ నరేష్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

19 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ ముగియడంతో ‘ఇది నా ప్యాకప్ డాన్స్’ అంటూ పూజా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో.. డెహ్రాడున్ షెడ్యూల్ పూర్త‌యింద‌ని పూజా హెగ్డే చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌య్యింది. కాగా.. తదుపరి షెడ్యూల్‌ను యు.ఎస్.లో చిత్రీకరించనున్నట్టు సమాచారం. మహేష్ డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్న ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here