మ‌రో మెగా హీరోతో దేవిశ్రీ ప్ర‌సాద్‌?

Devi Sri Prasad Music for Another Mega Hero, Sai Dharam Tej With DSP, DSP Movie with Sai Dharam Tej, DSP Music for Sai Dharam Tej, Sai Dharam Tej Next Movie Update, Devi Sri Prasad Upcoming Movie, Telugu FilmNagar, Telugu Movie News, Telugu Cinema Updates
Devi Sri Prasad Music for Another Mega Hero

మెగా ఫ్యామిలీ హీరోల‌కి క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, వ‌ప‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఇలా ఈ న‌లుగురు హీరోలతోనూ మ‌ణిశ‌ర్మ త‌ర‌హాలో తొలి సారి చేసిన సినిమాల‌తో విజ‌యాల‌ను అందుకున్నారు దేవిశ్రీ. అలాగే.. మ‌రికొన్ని విజ‌యాల‌ను ఆ న‌లుగురు మెగా హీరోల కాంబినేష‌న్‌లో సొంతం చేసుకున్నారు.

ప్ర‌స్తుతం మ‌రో మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో ‘ఎఫ్ 2’ కోసం ఫ‌స్ట్ టైమ్ ప‌నిచేయ‌బోతున్నారు డీఎస్పీ. అంతేగాకుండా.. మెగా క్యాంప్‌కి చెందిన మ‌రో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌తోనూ దేవిశ్రీ ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఆ వివ‌రాల్లోకి వెళితే.. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ హీరోగా ‘చిత్ర‌ల‌హ‌రి’ పేరుతో ఓ చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపికయ్యార‌ని స‌మాచారం.

తండ్రీ కొడుకుల అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్నారు. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, రితికా సింగ్ క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్ర‌క‌ట‌న‌తో స‌హా అతి త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here