టీజ‌ర్ టాక్‌: వై.ఎస్‌.ఆర్‌గా మ‌మ్ముట్టి జీవించారు

Yatra Teaser Out Now, Yatra teaser, YSR Biopic, mammootty, yatra, mammootty as ysr, ys rajasekhara reddy, Yatra Telugu Movie Teaser, Yatra Movie Latest News, Telugu FilmNagar, Telugu Movies 2018, Latest Telugu Film News, Tollywood Updates
Yatra teaser out now

తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో స్థిర స్థానం పొందిన ముఖ్య‌మంత్రుల్లో దివంగ‌త నేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర రెడ్డి ఒక‌రు. అలాంటి వై.ఎస్‌.ఆర్ ముఖ్య‌మంత్రి కాక‌ముందు చేసిన‌ పాద‌యాత్ర నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. అదే ‘యాత్ర‌’. ఇందులో.. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ మెగాస్టార్‌ మ‌మ్ముట్టి క‌నిపించ‌నున్నారు. మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎం.ఎం. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నేడు (జూలై 8) వై.ఎస్‌.ఆర్‌. జ‌యంతి. ఈ సంద‌ర్భంగా.. చిత్ర యూనిట్ ‘యాత్ర’ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ”తెలుసుకోవాల‌నుంది.. వినాల‌నుంది.. క‌డ‌ప దాటి ప్ర‌తీ గ‌డ‌ప‌లోకి వ‌స్తున్నాను.. మీతో క‌లిసి న‌డ‌వాల‌నుంది.. మీ గుండె చ‌ప్పుడు వినాల‌నున్న‌ది.. గెలిస్తే పట్టుద‌ల అంటాం.. ఓడిపోతే మూర్ఖ‌త్వం అంటాం.. ఈ పాద‌యాత్ర ప‌ట్టుద‌లో మూర్ఖ‌త్వ‌మో చ‌రిత్రే నిర్ణయించుకోని” అంటూ సాగే ఈ టీజ‌ర్‌లో.. మ‌మ్ముట్టిని చూస్తే వై.ఎస్‌.ఆర్‌నే జ్ఞ‌ప్తికి వ‌స్తున్నారు. వై.ఎస్‌.ఆర్ బాడీ లాంగ్వేజ్‌తో, ఆయ‌న హావ‌భావాల‌తో మ‌మ్ముట్టి మ‌రోసారి పాత్ర‌లో జీవించేశార‌నే చెప్పాలి.

కాగా.. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here