వైర‌ల్‌.. డిఫ‌రెంట్ గెట‌ప్‌లో నాగ్‌

Viral Nagarjuna in Different Getup, Nagarjuna Latest News, Devadas Movie Latest News, Nagarjuna Nani Multistarrer, Nagarjunas New Getup in Devadas Movie, Nagarjuna Nani Devadas, Devadas Movie Story, Telugu FilmNagar, Telugu Movies 2018, Latest Telugu Film News, Tollywood Updates, #Devadas
Viral Nagarjuna in different get up

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం.. ‘దేవ‌దాస్‌’. నేచుర‌ల్ స్టార్ నాని మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ సినిమాలో నాగ్ రొమాంటిక్‌ డాన్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ డాన్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా.. కొన్ని డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో ఆయ‌న క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది. అందులో ఓ గెట‌ప్‌గా.. సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో వైర‌ల్ అవుతోంది. ఆ ఫొటోలో.. ఓ పాప‌తో క‌లిసి తాత‌య్య గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు నాగ్. మ‌రి.. ఈ గెట‌ప్‌ ‘దేవ‌దాస్’ సినిమా కోస‌మా? లేదంటే ఏదైనా యాడ్ కోసం జ‌రుగుతున్న షూట్‌లో దిగిన ఫొటోనా? అనేది తెలియాల్సి ఉంది.

శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘దేవ‌దాస్’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత సి.అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు.  ఆకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నారు. కాగా.. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here