స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌తో సాక్ష్యం ట్రైల‌ర్‌

Sakshyam Trailer Released, Sakshyam Telugu movie trailer, Sakshyam Trailer, #SakshyamTrailer, Sakshyam Movie Trailer, Bellamkonda Srinivas New Movie, Telugu FilmNagar, Telugu Movies 2018, Telugu Cinema News, Tollywood Latest Updates
Sakshyam Trailer Released

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, పూజా హెగ్డే జంట‌గా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాక్ష్యం’. నేచ‌ర్ ఈజ్ ద విట్‌నెస్ అనేది దీనికి ట్యాగ్ లైన్‌. జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్ కుమార్‌, మీనా, ర‌వికిష‌న్‌, అశుతోష్ రాణా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకి ఏస్ రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న‌ ఈ సినిమా జూలై 27న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. అలాగే ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేశారు. విజువ‌ల్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ.. కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీగా ఈ సినిమా తెర‌కెక్కింద‌ని ఈ ట్రైల‌ర్ చెప్ప‌కనే చెబుతోంది. స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌, ఆలోచింజేసే డైలాగ్స్‌, యాక్ష‌న్ ఘ‌ట్టాలు.. ఇలా మాస్‌, క్లాస్ అందరిని మెప్పించేలా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచింద‌నే చెప్పాలి.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here