చ‌ర‌ణ్ సినిమా గురించి కియారా ఏమ‌న్నారంటే..

Kiara Adwani about RC12, Kiara Advani latest statement on RC12, Ram Charan, Kiara Advani starrer RC 12, #RC12 Latest News, Kiara Advan, Ram Charan Boyapati Movie Latest News, Kiara Advani Upcoming Telugu Movies, Telugu FilmNagar, Telugu Film News, Tollywood Latest Updates
Kiara Adwani about RC12
‘భ‌ర‌త్ అనే నేను’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక కియారా అద్వాని. ఆ సినిమాలో వ‌సుమ‌తిగా న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌లో క‌నిపించి మంచి మార్కులు తెచ్చుకున్నారు ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం కియారా.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు కియారా.
రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి త‌ను న‌టిస్తున్న సినిమా కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్ అని.. ఇందులో యాక్ష‌న్‌, కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్ వంటి అన్ని అంశాలు ఉన్నాయ‌ని.. అలాగే ఓ ఆస‌క్తిక‌ర‌మైన మలుపు కూడా ఉంటుంద‌ని కియారా ఆ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. మ‌రి ఆ మ‌లుపు ఏమిటో తెలియాలంటే వ‌చ్చే ఏడాది సంక్రాంతి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here