గీత గోవిందం ఫ‌స్ట్ సింగిల్ ఎప్పుడంటే..

Geetha Govindam First Single Update, Geetha Govindam First Single On July 10, Vijay Deverakonda Geetha Govindam single, Vijay Deverakonda and Rashmika Mandanna 'Geetha Govindam, Geetha Govindam, Geetha Govindam Songs, Telugu FilmNagar, Telugu Movies 2018, Latest Telugu Film News, Tollywood Updates,
Geetha Govindam First Single Update
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన‌ చిత్రం ‘గీత గోవిందం’. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని జిఎ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీ వాస్ నిర్మించారు. . ప్ర‌ముఖ నిర్మాత‌ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఆగ‌స్టు 15న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. గోపి సుంద‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ”ఇంకేమ్ ఇంకేమ్ ఇంకేమ్ కావాలే” అంటూ సాగే పాట‌ని ఈ నెల 10న ఉద‌యం 11.50 గంట‌ల‌కు ఫ‌స్ట్ సింగిల్‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్నిక‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: మ‌ణికంద‌న్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్, ఆర్ట్‌: ర‌మ‌ణ వంక‌.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here