అర‌వింద స‌మేత‌.. కొత్త క‌బుర్లు

Aravinda Sametha Veera Raghava Latest Update, Aravinda Sametha Latest News, Aravinda Sametha Veera Raghava Shooting Progess, Aravinda Sametha Movie Shooting Update, Aravinda Sametha Veera Raghava Latest Update, Jr NTR Trivikram Movie Update, Telugu FilmNagar, Latest Tollywood Movie Update, Telugu Cinema News
Aravinda Sametha Veera Raghava Latest Update

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే, ఈషా రెబ్బా క‌థానాయిక‌లు. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. మ‌రో వారం రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్త‌వుతుంది. ఈ షెడ్యూల్‌లో యాక్ష‌న్ సీన్స్‌ను షూట్ చేస్తున్నార‌ని స‌మాచారం.

కాగా.. త‌దుప‌రి షెడ్యూల్‌లో తార‌క్‌, పూజా పై కాలేజ్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. ఆ తర్వాత పొల్లాచ్చిలో పాట‌లు, కొన్ని ముఖ్య‌మైన‌ సన్నివేశాలు తీసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. విజ‌య ద‌శ‌మి కానుక‌గా  ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కాగా.. ఆగ‌స్టు 15న ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

  Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here