విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌?

Kajal Next Movies, Kajal To Pair Up With Vijay Devarakonda?, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Updates, Vijay Devarakonda as Kajal pair?, Vijay Devarakonda Upcoming Movies, Vijaya Devarakonda Kajal Film
Kajal To Pair Up With Vijay Devarakonda?

‘ఓన‌మాలు’, ‘మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాల‌తో సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు క్రాంతి మాధ‌వ్‌. ఈ చిత్రాల‌ త‌రువాత‌ సునీల్ హీరోగా క్రాంతి మాధ‌వ్ రూపొందించిన ‘ఉంగ‌రాల రాంబాబు’ నిరాశ‌ప‌రిచినా.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో వార్త‌ల్లో నిలిచారాయ‌న‌. ‘అర్జున్ రెడ్డి’తో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క్రాంతి మాధ‌వ్ ఓ సినిమా చేయ‌నున్నారు.

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్‌.రామారావు నిర్మించ‌నున్న ఈ కుటుంబ క‌థా చిత్రం అక్టోబ‌ర్ 10 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. యూర‌ప్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జోడీగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. 2019 ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here