హ్యాపి వెడ్డింగ్ నుంచి మ‌రో సింగిల్‌

Dheemthana Lyrical Song from Happy Wedding Out Now, Happy Wedding Movie Songs, Dheemthana Full Song Lyrical, Dheemthana Thomthana, Dheemthana Song, Happy Wedding, Happy Wedding Movie, Happy Wedding Telugu Movie, Telugu FilmNagar, Niharika Happy Wedding Songs, Telugu Cinema News, Tollywood Latest Updates
Dheemthana Lyrical Song from Happy Wedding Out Now
పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగే రోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రిగింద‌నే క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్‌’. .సుమంత్ అశ్విన్‌, నిహారిక కొణిదెల హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ద్వారా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నారు. పాకెట్ సినిమా, యు.వి క్రియేష‌న్స్ సంస్థ‌ల సంయుక్త నిర్మాణంలో ఎం.సుమంత్ రాజు ఈ మూవీని నిర్మించారు. ‘ఫిదా’ ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ సంగీతమందించారు. త‌మ‌న్ నేప‌థ్య సంగీత‌మందించారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు (శ‌నివారం) ”దీంతన తోంతన మాంగల్యం తంతున, కళ్యాణం అంటే ఇద్దరి మనసులు కలిసెనా” అంటూ సాగే పాట‌ని మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేశారు. శ్రీ‌మ‌ణి సాహిత్యంలో దిన్‌క‌ర్ గానం చేసిన ఈ పాట పెళ్ళి నేప‌థ్యంలో సాగే గీతంగా తెర‌కెక్కింది.
కాగా.. జూలై 27న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here