సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్ల‌ర్‌గా వైఫ్ ఆఫ్ రామ్

W/O Ram Movie Release Date Confirmed,Latest Telugu Movie Updates,Telugu Cinema News 2018,Telugu Filmnagar,Upcoming Telugu Movies 2018,W/o Ram Movie Release Date,Manchu Laxmi W/o Ram Movie Release Date Locked,W/O Ram Movie 2018 Latest News,W/O Ram Release Date Fixed,Manchu Laxmi New Movie
W/O Ram Movie Release Date

మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `w/o రామ్‌`. సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ద్వారా విజ‌య్ యేల‌కంటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి టి.జి.విశ్వ ప్ర‌సాద్‌, మంచు ల‌క్ష్మి నిర్మాత‌లు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు విజ‌య్ యేలకంటి మాట్లాడుతూ “ఓ ఎన్.జి.వో. లో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త హత్యకు గురవుతాడు. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటీ అనేది ఈ సినిమా. ప్ర‌తీ సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది“ అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ “ సెన్సార్ పనులు పూర్తి చేసుకొన్న మా సినిమా.. ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి మూవీ టీంను ప్రశంసించారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది“ అన్నారు.

మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ “ 115 నిమిషాల పాటు ఉత్కంఠ‌భ‌రితంగా సాగే ఈ సినిమా.. ఫ‌స్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వ‌ర‌కు చూసే ప్రేక్ష‌కుడ్ని క‌ట్టిప‌డేస్తుంది“ అని అన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here