సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకున్న విజేత‌

Vijetha Movie Completes Censor Formalities, Vijetha Censor Report, Vijetha Movie Censor Review, Kalyan Dhev Vijetha Movie, Vijetha Censor, Clean U Certificate For Vijetha, Vijetha Censor Talk, Vijetha Movie, Telugu FilmNagar, Telugu Cinema News, Latest Film updates
Vijetha Movie Completes Censor Formalities

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘విజేత’. కేర‌ళ కుట్టి మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించిన‌ ఈ సినిమాకి రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వారాహి చ‌ల‌న చిత్రం ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీత‌మందించారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్ర‌మాలు శుక్ర‌వారం పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.

సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: సెంథిల్ కుమార్‌.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here