తేజ్ ఐ లవ్ యు రివ్యూ

Tej I Love You Review,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Tej I Love You Movie Review,Tej I Love You Telugu Movie Review,Tej I Love You Movie Review & Rating,Tej I Love You Movie Story,Tej I Love You Telugu Movie Live Updates,Tej I Love You Movie Public Talk,Tej I Love You Telugu Movie Public Response,Latest Telugu Movie Reviews
Tej I Love You Review

చిత్రం: తేజ్ ఐ ల‌వ్ యు
న‌టీన‌టులు : సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, ప‌విత్రా లోకేష్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హ‌ర్ష‌, జోష్ ర‌వి, భావ‌న‌ త‌దిత‌రులు
మాట‌లు: ‘డార్లింగ్’ స్వామి
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ఐ.ఆండ్రూ
క‌ళ‌: సాహి సురేష్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
నిర్మాత‌: కె.ఎస్‌.రామారావు
ద‌ర్శ‌క‌త్వం: ఎ.క‌రుణాక‌ర‌న్‌
విడుద‌ల తేది: 6 జూలై 2018
చిత్ర నిడివి: 144 నిమిషాలు

తెలుగు తెర‌పై బ‌ల‌మైన ముద్ర వేసిన ప్రేమ‌క‌థా చిత్రాల్లో ‘తొలిప్రేమ’ (1998) ఒక‌టి. 20 ఏళ్ళ క్రితం విడుద‌లైన ఈ క్లాసిక్ ల‌వ్‌స్టోరీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఆ త‌రువాత కూడా ప్రేమ‌క‌థా చిత్రాలే చేస్తూ ‘ప్రేమక‌థా చిత్రాల స్పెష‌లిస్ట్’ అనిపించుకున్నారు. స్వ‌ల్ప విరామం త‌రువాత క‌రుణాక‌ర‌న్ రూపొందించిన చిత్రం ‘తేజ్ ఐ ల‌వ్ యు’. తన తొలి చిత్ర క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మేన‌ల్లుడు అయిన‌ సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా క‌రుణాక‌ర‌న్ రూపొందించిన ఈ చిత్రం శుక్ర‌వారం తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమాపై ‘తెలుగు ఫిల్మ్‌న‌గ‌ర్.కామ్’ అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థాంశం

చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన  తేజ్‌ (సాయిధ‌ర‌మ్ తేజ్‌)ని.. అత‌ని పెద‌నాన్న (జ‌య‌ప్ర‌కాష్‌), పెద్ద‌మ్మ (ప‌విత్రా లోకేష్‌) చేర‌దీసి పెంచుతుంటారు. అయితే.. ఓ రోజు రాత్రి త‌న‌కు ఏ మాత్రం ప‌రిచ‌యం లేని స్త్రీని.. గూండాల నుంచి కాపాడే ప్ర‌య‌త్నంలో వారిని చంపేస్తాడు తేజ్. స‌రైన సాక్ష్యాలు లేని కార‌ణంగా ఏడేళ్ల‌పాటు జైలుశిక్ష అనుభ‌విస్తాడు. పెరిగి పెద్ద‌వాడ‌య్యాక‌.. మ‌రో సంద‌ర్భంలో త‌న త‌మ్ముడు కూతురు లేచిపోవ‌డానికి తేజ్ కార‌ణ‌మ‌ని తెలిసి అత‌న్ని ఇంటినుంచి పంపించేస్తాడు తేజ్ పెద‌నాన్న‌.   హాస్ట‌ల్‌లో ఉంటూ చ‌దువుకుంటున్న తేజ్‌.. బాబాయ్ (పృథ్వీ) ఇంటికి వెళుతున్న స‌మ‌యంలో.. ట్రైన్‌లో  నందిని (అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్‌) అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. త‌న త‌ల్లి చివ‌రి కోరిక‌ను తీర్చ‌డానికి లండ‌న్ వ‌చ్చిన నందిని కూడా.. కొన్ని నాట‌కీయ ప‌రిణామాల త‌రువాత తేజ్‌తో ప్రేమ‌లో ప‌డుతుంది. అయితే.. త‌న ప్రేమ‌ను వ్యక్తం చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో ఓ యాక్సిడెంట్‌కు గురై.. గ‌తాన్ని మ‌ర‌చిపోతుంది. ఈ విష‌యం తెలిసిన తేజ్‌, అత‌ని ఫ్రెండ్స్ ఆమెకు గ‌తాన్ని గుర్తు చేసే ప్ర‌య‌త్నంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశారు? అస‌లు నందిని త‌ల్లి చివ‌రి కోరిక ఏమిటి? న‌ందిని త‌ల్లికి, తేజ్‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏమిటి? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఈ చిత్రం.

విశ్లేష‌ణ‌

సాధార‌ణంగా ఎ.క‌రుణాక‌ర‌న్ సినిమాలంటే గుర్తొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. పెద్ద కుటుంబం ఉన్నా ఏ బాధ్య‌తలు లేకుండా తిరిగే క‌థానాయ‌కుడు, అత‌నికో ఫ్రెండ్స్ బ్యాచ్‌.. వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా ఎంట్రీ ఇచ్చే క‌థానాయిక‌.. హీరోహీరోయిన్ల మ‌ధ్య ప్రేమ క‌థ ఓ కొలిక్కి వ‌స్తుంద‌నుకున్న స‌మ‌యంలో ఓ ఇంట్ర‌వెల్ ట్విస్ట్‌.. క‌థానాయ‌కుడి కుటుంబ స‌భ్యుల‌తో క‌థానాయిక క‌లిసి పోయి సంద‌డి చేసే దృశ్యాలు, మ‌ధ్య మ‌ధ్య‌లో మాంటేజ్ సాంగ్స్‌, కంటికింపుగా సాగే విజువ‌ల్స్‌.. ఇలా కొన్ని విష‌యాలు ప‌క్కాగా ఉంటాయి. ‘తేజ్ ఐ ల‌వ్ యు’లో కూడా ఇవ‌న్నీ ఉంటాయి. కాక‌పోతే.. వాటికి ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం లేక‌పోవ‌డం ఈ సినిమాకి ప్ర‌తిబంధ‌కంగా మారింద‌నే చెప్పాలి. తొలి రోజుల్లో క‌రుణాక‌ర‌న్ రూపొందించిన చిత్రాల ఫ‌లితాలు ఎలా ఉన్నా.. క‌చ్చితంగా ఫీల్‌, ఎమోష‌న్స్ ఉండేవి. అలాంటివి ఈ సినిమాలో ఏ కోశానా క‌నిపించ‌లేదనే చెప్పాలి. అయితే.. ఒక‌ట్రెండు స‌న్నివేశాల్లో మాత్రం క‌రుణాక‌ర‌న్ మార్క్ ఫ‌న్ త‌ళుక్కున మెరిసింది.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న కెరీర్‌లోనే తొలిసారిగా పూర్తిస్థాయి ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌లో క‌నిపించారు. కుటుంబ స‌న్నివేశాల్లో, ప్రేమ స‌న్నివేశాల్లో రాణించారు. అయితే.. త‌న ఫిజిక్ మీద దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌న్ క్యూట్‌గా ఉన్నారు. ఎప్పుడూ త‌న పాత్ర‌కి త‌నే డ‌బ్బింగ్ చెప్పుకునే అనుప‌మ‌.. ఈ సారి డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌పై ఆధార‌ప‌డ్డారు. అయితే.. అది సెట్ అవ్వ‌లేద‌నే చెప్పాలి. ఇక మిగిలిన న‌టీన‌టులంతా త‌మ త‌మ పాత్ర‌ల‌ పరిధి మేర మెప్పించారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. గోపి సుంద‌ర్ సంగీతంలో పాట‌ల‌న్నీ బాగున్నాయి. ముఖ్యంగా ‘అంద‌మైన చంద‌మామ నువ్వేనా’ పాట విన‌డానికి, చూడ‌డానికి చాలా బాగుంది. నేప‌థ్య సంగీతం సినిమా మూడ్‌ని ఎలివేట్ చేసింది. అలాగే.. ఐ.ఆండ్రూ ఛాయాగ్ర‌హ‌ణం ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. పాట‌ల్లో త‌న కెమెరా వ‌ర్క్ మెప్పిస్తుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ”ఖ‌ర్చు పెట్టార‌ని ఫ్లాప్ సినిమాని హిట్ సినిమా చేస్తారా జ‌నాలు” వంటి డైలాగులు బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌

ఛాయాగ్ర‌హ‌ణం

సంగీతం, నేప‌థ్య సంగీతం

నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్‌

రొటీన్ స్టోరీ

స్క్రీన్‌ప్లే

డైరెక్ష‌న్‌

ప్రేమ‌క‌థ‌కు త‌గ్గ ఫీల్‌, ఎమోష‌న్స్ లేక‌పోవ‌డం

బాట‌మ్ లైన్‌:  క‌రుణాక‌ర‌న్ మార్క్ ల‌వ్ స్టోరీ

 

For English Review: Tej I Love You Movie Review

తేజ్ ఐ లవ్ యు రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performances
2.5
Sending
User Review
0 (0 votes)

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here