స్ట్రాంగ్ ఓపెనింగ్‌: ప‌ంతం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

Pantham First Day Box Office Collections,Latest Telugu Movie Updates,Telugu Cinema News 2018,Telugu Filmnagar,Upcoming Telugu Movies 2018,Gopichand Pantham First Day Collections,Pantham First Day Collections,Pantham Collections,Pantham 1st Day Collections,Pantham First Day Worldwide Collections
Pantham First Day Box Office Collections

యాక్ష‌న్ హీరో గోపీచంద్ నటించిన 25వ చిత్రం ‘పంతం’. మెహ‌రీన్ క‌థానాయిక‌. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ద్వారా కె.చక్రవర్తి (చ‌క్రి) దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. గోపీసుందర్ సంగీతమందించిన ఈ చిత్రం గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా.. తొలి రోజు క‌లెక్ష‌న్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే.. గోపీచంద్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న సినిమాగా ‘పంతం’ నిలిచింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.5.2కోట్ల గ్రాస్‌ను.. అలాగే రూ.3.22 కోట్ల షేర్‌ను ఈ చిత్రం రాబ‌ట్టుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ చిత్ర పి.ఆర్.ఓ వంశీ కాకా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ.. తొలి రోజు పంతం స్ట్రాంగ్ ఓపెనింగ్‌తో స్టార్ట్ అయింద‌ని.. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.5.2 కోట్ల గ్రాస్, రూ.3.22 కోట్ల షేర్‌ రాబ‌ట్టింద‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here