యాత్ర‌.. టీజ‌ర్‌ ఎప్పుడంటే..

Yatra Teaser Release Date Locked, Yatra teaser on July 8th at 00.01 am, YSR biopic teaser release date announced, Yatra Teaser Release On 8th July. #Yatra, #YatraTeaserOnJuly8th, Mammootty Yatra Teaser, YSR biopic Yatra teaser, Telugu FilmNagar, Latest Film News, Telugu Cinema Updates, Yatra Movie Teaser
Yatra Teaser Release Date Locked

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర రెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వై.ఎస్‌.ఆర్ సాగించిన‌ పాద‌యాత్ర నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రి రాజా రెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు.. క‌ర్నూల్‌కు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కురాలి పాత్ర‌లో అన‌సూయ క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం.

‘ఆనందో బ్ర‌హ్మ’ ఫేమ్‌ మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎం.ఎం. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమా టీజ‌ర్‌ను వై.ఎస్.ఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ నెల 8న ఉద‌యం విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here