ఈ నెల 9 నుంచి స‌వ్య‌సాచి చివ‌రి షెడ్యూల్‌

Savyasachi Final Schedule Details, final schedule details of savyasachi, Telugu Cinema news, Naga Chaitanya Savyasachi final schedule, #Savyasachi, Naga Chaitanya Savyasachi Latest Updates, Naga Chaitanya Upcoming Movie, Savyasachi Telugu Movie, Telugu FilmNagar, Latest Tollywood Updates,
Savyasachi final Schedule Details

రెండు చేతుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోగ‌ల ఓ యువ‌కుడి క‌థ‌తో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘స‌వ్య‌సాచి’. యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో ‘ప్రేమ‌మ్’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత రూపొందుతున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. మాధ‌వ‌న్, భూమిక ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ని ఈ నెల 9 నుంచి ప్రారంభించ‌నున్నార‌ని తెలిసింది. ప‌ది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ప్యాచ్ వ‌ర్క్‌తో పాటు నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నాపై ప్ర‌త్యేక గీతాన్ని (రీమిక్స్ సాంగ్‌) ప్లాన్ చేశార‌ట‌. ఆగ‌స్టు ద్వితియార్ధంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ని స‌మాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here