పంతం రివ్యూ

Pantham Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Pantham Review,Pantham Telugu Movie Review,Pantham Movie Review & Rating,Pantham Movie Story,Pantham Telugu Movie Live Updates,Pantham Movie Public Talk,Pantham Telugu Movie Public Response

చిత్రం: ప‌ంతం
న‌టీన‌టులు: గోపీచంద్‌, మెహ‌రీన్‌, సంప‌త్‌, సాయాజీ షిండే, త‌నికెళ్ళ భ‌ర‌ణి, శ్రీ‌నివాస‌రెడ్డి, పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, హంసా నందిని, ముఖేష్ రుషి, ప‌విత్రా లోకేష్‌, హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, ఆశిష్ విద్యార్థి, స‌త్యా కృష్ణ‌న్‌, ఝాన్సీ, ప్రియ‌, కాశీ విశ్వ‌నాథ్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను, అతిథి పాత్ర‌ల్లో గిరి బాబు, రాళ్ళ‌ప‌ల్లి త‌దిత‌రులు
సంగీతం: గోపీసుంద‌ర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌
క‌ళ‌: ఎ.ఎస్.ప్ర‌కాష్‌
నిర్మాణ సంస్థ‌: శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌
నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: కె.చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి)
విడుద‌ల తేది: 5 జూలై 2018
చిత్ర నిడివి: 145 నిమిషాలు

న‌టుడిగా గోపీచంద్‌ది 17 ఏళ్ళ ప్ర‌స్థానం. ఈ 17 ఏళ్ళ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 24 సినిమాలు చేసిన గోపీచంద్‌.. తాజా చిత్రం ‘పంతం’తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు కె.చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి) రూపొందించిన ఈ సినిమాని శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.కె.రాధామోహ‌న్ నిర్మించారు. గురువారం తెర‌పైకి వ‌చ్చిన ఈ సినిమాపై ‘తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌. కామ్’ అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థాంశం

జ‌నాల డ‌బ్బును స్కామ్ చేసి ప‌బ్బం గ‌డుపుకుంటున్న మంత్రుల‌ను టార్గెట్ చేసుకుంటూ.. వారి ద‌గ్గ‌రున్న‌ డ‌బ్బును స్కెచ్ వేసి మ‌రీ దోచుకుంటుంటాడు విక్రాంత్‌(గోపీచంద్‌). అంతేగాకుండా.. ఆ డ‌బ్బును దుర్గాదేవి చారిట‌బుల్ ట్ర‌స్ట్‌కు పంపిస్తుంటాడు. ఆ ట్ర‌స్ట్ ద్వారా అయిన‌వాళ్ళ‌ను, అవ‌య‌వాల‌ను కోల్పోయిన వారికి సాయం అందుతుంటుంది. మ‌రోవైపు.. స‌ద‌రు మంత్రులు త‌మ డ‌బ్బుని దోచుకుంటున్న వ్య‌క్తి గురించి ఆరా తీస్తుంటారు. ఇంత‌కీ విక్రాంత్ గురించి వారికి తెలుస్తుందా? అస‌లు విక్రాంత్ నేప‌థ్యం ఏమిటి? ఎందుకు ఈ దొంగ‌త‌నాలు చేస్తున్నాడు? సురానా ఇండ‌స్ట్రీస్ అధినేత ఆనంద్ సురానా (ముఖేష్ రుషి)తో అత‌నికున్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన క‌థ‌. ఈ క‌థ‌లో.. విక్రాంత్‌, అక్ష‌ర (మెహ‌రీన్‌)కు మ‌ధ్య సాగే ప్రేమ క‌థ కూడా కీల‌క‌మే.

విశ్లేష‌ణ‌

పేద‌ల‌ను దోచుకునే పెద్ద‌ల‌ను టార్గెట్ చేసుకుని.. తిరిగి ఆ డ‌బ్బును ఆ పేద‌ల‌కు అందేలా చేసే రాబిన్ హుడ్ త‌ర‌హా యువ‌కుడి క‌థ ఇది. అయితే.. ఆ రాబిన్ హుడ్ పేద‌వాడు కాకుండా ఓ ధ‌న‌వంతుడు కావ‌డం అన్న‌ది ఇందులోని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం. ఆలోచింప‌జేసే కొన్ని స‌న్నివేశాలు, పోరాట ఘ‌ట్టాల‌తో ద‌ర్శ‌కుడు త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ అల‌రిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌ని కూడా చ‌క్క‌గా డిజైన్ చేసుకున్న ద‌ర్శ‌కుడు.. క‌థ‌నం విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త తీసుకుని ఉంటే.. సినిమా స్థాయి మ‌రోలా ఉండేది. మొత్తానికి.. గోపీచంద్ యాక్ష‌న్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా.. ఆయ‌న అభిమానులను అల‌రించేలా తెర‌కెక్కింద‌నే చెప్పాలి.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. గోపీచంద్ ఎప్ప‌టిలానే త‌న పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. రెండు షేడ్స్ ఉన్న ఈ పాత్ర‌లో వేరియేష‌న్స్ చూపించారు. ముఖ్యంగా ప‌తాక స‌న్నివేశాల్లో త‌న న‌ట‌న మెప్పిస్తుంది. పోరాట ఘ‌ట్టాల్లోనూ ఆక‌ట్టుకున్నారు. క‌థానాయిక మెహ‌రీన్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోయినా.. పాట‌ల్లో త‌న గ్లామ‌ర్‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు. సంప‌త్‌, శ్రీ‌నివాస రెడ్డి, సాయాజీ షిండే, ముఖేష్ రుషి.. ఇలా అంద‌రూ త‌మ‌ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. గోపీ సుంద‌ర్ సంగీతంలో ‘ఫ‌స్ట్ టైమ్’ పాట విన‌డానికి, చూడ‌డానికి బాగుంది. నేప‌థ్య సంగీతం సినిమా మూడ్‌ని ఎలివేట్ చేసింది. ప్ర‌సాద్ మూరెళ్ళ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. పాట‌లు, పోరాట ఘ‌ట్టాలను చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. ఎడిటింగ్ క్రిస్పీ గా ఉంది. మాట‌ల్లో ”మంచి మ‌న‌సు ఉన్న‌వాళ్ళంతా సెల‌బ్రిటీలే”, ”క‌ష్టం తీర్చ‌క‌పోయినా ప‌ర్లేదు.. కానీ ఆ క‌ష్టాన్ని క్యాష్ చేసుకోవాల‌నే మ‌న‌స్త‌త్వం క‌రెక్ట్ కాదు”, ”నా డ‌బ్బుతో చేస్తే సాయం.. దోచుకున్న వాళ్ళ డ‌బ్బుతో చేస్తే న్యాయం” వంటి సంభాష‌ణ‌లు అల‌రిస్తాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌

గోపీచంద్‌
పాట‌లు, నేప‌థ్య సంగీతం
ఛాయాగ్ర‌హ‌ణం
సంభాష‌ణ‌లు
ప‌తాక స‌న్నివేశాలు
నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్‌

రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే

బాట‌మ్ లైన్‌: మ‌రో రాబిన్‌హుడ్ స్టోరీ

పంతం రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performances
3.3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here