దేవ‌గా నాగ్‌.. దాస్‌గా నాని

Nagarjuna And Nani Multi Starrer Movie Title Confirmed,Latest Telugu Movie Updates,Telugu Cinema News 2018,Telugu Filmnagar,Upcoming Telugu Movies 2018,Nagarjuna And Nani Multi Starrer Movie Title as Devadas,Devadas Title for Nag and Nani Multistarrer,Nagarjuna and Natural Star Nani Grab ANR Title
Nagarjuna And Nani Multi Starrer Movie Title Confirmed

కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కులుగా శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇప్ప‌టివ‌ర‌కు 65 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది.

ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాకి ‘దేవ‌దాస్’ అనే టైటిల్ వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ రోజు (గురువారం) క‌థానాయ‌కుడు నాని ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. దేవ అనే డాన్ పాత్ర‌లో నాగ్ న‌టిస్తుండ‌గా.. దాస్ అనే డాక్ట‌ర్ పాత్ర‌లో నాని క‌నిపించ‌బోతున్నారు. శాంతాభాయ్ మెమోరియ‌ల్ చారిటి హాస్పిట‌ల్ చుట్టూ తిరిగే అవుట్ అండ్ అవుట్ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఆకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నారు. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here