అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ టీజ‌ర్‌, ఆడియో ఫంక్ష‌న్ డిటైల్స్‌

Aravinda Sametha Veera Raghava Teaser Audio Function Details, Aravinda Sametha Veera Raghava Teaser Update, Jr NTR Aravinda Sametha Veera Raghava Teaser, Aravinda Sametha Teaser News, Aravinda Sametha Audio Launch News, Jr Ntr Trivikram Movie Latest News, Telugu FilmNagar, Latest Tollywood Film News, Telugu Cinema News
Aravinda Sametha Veera Raghava Teaser Audio Function Details

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సాధారణంగా పెద్ద హీరోలు నటించే సినిమాల టీజర్‌లు గాని, ట్రైలర్‌లు గాని విడుదల చేయాలంటే ఓ ప్ర‌త్యేక‌ సందర్భం ఉండాలి.  ఇప్పుడు అలాంటి సందర్భమే ‘అరవింద సమేత’కు దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా టీజర్‌ను దేశ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఆగష్టు 15న విడుదల చేయడానికి నిర్మాణ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

అలాగే సెప్టెంబర్ నెల రెండో వారంలో అంటే.. వినాయక చవితి సందర్భంగా ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు స‌మాచారం. అదేవిధంగా చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా.. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌తో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here