ఈ రోజు కొత్త చాప్ట‌ర్ మొద‌లైంది: వ‌రుణ్ తేజ్‌

A New Chapter Starts Today Varun Tej, Varun Tej Exited F2, Victory Venkatesh & Varun Tej F2 Movie, F2 Movie Shooting Begins, F2 Movie Latest News, Varun Tej and Venkatesh F2, #F2, Varun Tej Next Movie, Venkatesh Upcoming Movies, Telugu FilmNagar, Latest Telugu Film News
A New Chapter Starts Today- Varun Tej

‘ఫిదా’, ‘తొలిప్రేమ’ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో.. ‘ఘాజీ’ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డి రూపొందిస్తున్న స్పేస్ మూవీలో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌తో క‌లిసి ‘ఎఫ్ 2’ అనే మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కాగా.. ఈ రోజు సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ”మ‌రో అంద‌మైన రోజు.. మ‌రో ఎగ్జైటింగ్ రోల్‌.. ఒక కొత్త చాఫ్ట‌ర్ ఈ రోజు మొద‌లైంది. ఎఫ్ 2 మొద‌లైంది. అనిల్ రావిపూడి (ద‌ర్శ‌కుడు) ఫ‌న్‌ను ప్రారంభించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు” అంటూ ట్వీట్ చేశారు.

త‌మ‌న్నా, మెహ‌రీన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ హౌస్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా తెర‌పైకి రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here