సెంటిమెంట్ ఫాలో అవుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌

Upcoming films follow crazy sentiment, Balakrishna Follows Sankranti Sentiment, Gopichand Continuing Hit Sentiment, Gopichand Pantham Movie,Dil Raju Continue Bommarillu Sentiment for #SrinivasaKalyanam, Trivikram Srinivas Continue sentiment on Aravinda Sametha, Jr Ntr Aravinda Sametha, Telugu FilmNagar, Tollywood Film New 2018, Latest Telugu Movies 2018
Upcoming films follow crazy sentiment

సినిమా ప‌రిశ్ర‌మ‌లో సెంటిమెంట్స్ బాగా వ‌ర్క‌వుట్ అవుతుంటాయి. ముఖ్యంగా ఓ సారి ఏదైనా విష‌యం బాగా క్లిక్ అయితే.. మ‌ళ్ళీ అటువైపే దృష్టి పెడుతుంటారు మ‌న సినీ ప్ర‌ముఖులు. ఈ ఏడాది కూడా అలాంటి సెంటిమెంట్స్ బాగానే రిపీట్ అవుతున్నాయి. ఓ సారి వాటివైపు లుక్కేస్తే..

నట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సెంటిమెంట్స్ ఎక్కువ. ముఖ్యంగా సంక్రాంతి సీజ‌న్‌లో త‌న సినిమాలు రిలీజ్ అయితే.. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ అవుతాయ‌నే న‌మ్మ‌కం ఆయ‌న‌లో బ‌లంగా ఉంది. అందుకే సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ఆ సీజ‌న్‌లో త‌న సినిమాల‌తో ప‌ల‌క‌రిస్తుంటారు బాల‌య్య‌. ‘పెద్ద‌న్న‌య్య‌’, ‘స‌మ‌ర‌సింహా రెడ్డి’, ‘న‌ర‌సింహ‌నాయుడు’, ‘ల‌క్ష్మీ న‌ర‌సింహా’, ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ చిత్రాలు సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌లై ఘ‌న‌విజ‌యాలు అందుకున్నాయి. ఈ ఏడాది కూడా బాల‌య్య మ‌రో సంక్రాంతి హిట్ కొట్టారు ‘జై సింహా’తో. విశేష‌మేమిటంటే.. గ‌తేడాది బాల‌య్య వందో చిత్రం ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ విడుద‌లైన జ‌న‌వ‌రి 12నే ఈ ఏడాది ‘జై సింహా’ రిలీజ‌య్యింది. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యి.. మ‌రో విజ‌యం బాల‌య్య ఖాతాలో ప‌డింది.

యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన క‌థానాయ‌కుడు గోపీచంద్‌. ‘య‌జ్ఞం’, ‘ర‌ణం’, ‘ల‌క్ష్యం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’ చిత్రాల‌తో మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌.. ఈ వారంలో త‌న 25వ చిత్రం ‘పంతం’తో ప‌ల‌క‌రించ‌నున్నారు. విశేష‌మేమిటంటే.. త‌న కెరీర్‌లో స్పెష‌ల్ మూవీగా నిలిచిన ‘ల‌క్ష్యం’ చిత్రం విడుద‌లైన జూలై 5నే ఈ సినిమా రాబోతోంది. ‘ల‌క్ష్యం’ ద్వారా శ్రీ‌వాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన‌ట్టే.. ‘పంతం’ ద్వారా కె.చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి) ప‌రిచ‌యం కానుండ‌డం చూస్తుంటే.. గోపీచంద్‌కు సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేలానే ఉంది. జూలై 5 మ‌రోసారి క‌లిసొస్తే.. ‘లౌక్యం’ త‌రువాత విజ‌యాలు లేని గోపీచంద్‌.. మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన‌ట్లే.

ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు సంస్థ‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కినా.. ‘బొమ్మ‌రిల్లు’ సినిమాతోనే ఆ సంస్థ స్థాయి పెరిగింద‌ని చెప్పాలి. ఆగ‌స్టు 9, 2006న విడుద‌లైన ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఆ సెంటిమెంట్‌తోనే త‌న తాజా చిత్రం ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ని కూడా ఆగ‌స్టు 9న రిలీజ్ చేయ‌డానికి దిల్ రాజు ప్లాన్ చేసుకున్నారు. సెంటిమెంట్ రిపీట్ అయితే.. వ‌రుస ప‌రాజ‌యాల‌లో ఉన్న నితిన్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి రావ‌డం ఖాయం.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌ల ర‌చ‌యిత‌గానే కాకుండా.. ద‌ర్శ‌కుడిగానూ సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్నారు. గ‌త చిత్రం ‘అజ్ఞాత‌వాసి’ నిరాశ‌ప‌రిచినా.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ రూపొందిస్తూ బిజీగా ఉన్నారు త్రివిక్ర‌మ్. రాయ‌ల సీమ నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. విశేష‌మేమిటంటే.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం ‘నువ్వే నువ్వే’ కూడా 2002లో ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10నే విడుద‌లైంది. ఆ తేది మ‌రోసారి క‌లిసొస్తే.. త్రివిక్ర‌మ్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేస్తారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here