తేజ్ ఐ ల‌వ్ యు..ర‌న్ టైమ్‌

Tej I Love You Movie Duration, Tej I Love You Run Time, Clean U, Tej I Love U Movie Censor Report, Tej I Love You Censored With U Certificate, Sai Dharam Tej and Anupama Tej I Love You, Tej I Love You Movie, Telugu FilmNagar, Latest Telugu Movie News 2018, Latest Tollywood Updates,
Tej I Love You Movie Duration
స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్ శైలే వేరు. తొలి చిత్రం ‘తొలి ప్రేమ’ నుంచి గ‌త చిత్రం ‘చిన్న‌దాన నీ కోసం’ వ‌ర‌కు ఆయ‌న‌ది ఇదే శైలి. తాజాగా ఈ ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ తెర‌కెక్కించిన చిత్రం ‘తేజ్ ఐ ల‌వ్ యు’. సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన ఈ సినిమాని కూడా కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ విధంగా తీర్చిదిద్దారాయ‌న‌.
క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత‌ కె.ఎస్‌.రామారావు రూపొందించిన ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ స్వ‌రాలందించారు.  ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ర‌న్ టైమ్ 144 నిమిషాలు (2 గంట‌ల 24 నిమిషాలు) అని తెలిసింది. ఒక విధంగా.. సినిమాకి ఇది క‌లిసొచ్చే అంశంగానే చెప్పుకోవ‌చ్చు. కాగా..ఈ నెల 6న ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here