టీజ‌ర్ టాక్‌.. ఈ ‘గూఢచారి’ అద‌ర‌గొట్టేశాడంతే..! 

Goodachari Movie Teaser Talk,Telugu Cinema News 2018,Telugu Filmnagar,Upcoming Telugu Movies 2018,Latest Telugu Movie Updates,Goodachari Movie Teaser,Goodachari Movie Teaser Review,Goodachari Teaser Out,#Goodachari,#GoodachariTeaser,Adivi Sesh Goodachari Teaser Talk,Goodachari Movie Latest Updates
Goodachari Movie Teaser Talk
అడివి శేష్‌, శోభితా ధూళిపాళ, ప్రకాష్‌ రాజ్‌, వెన్నెల కిశోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న చిత్రం ‘గూఢచారి’. ఏఎన్నార్ మ‌న‌వ‌రాలు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి చిత్ర క‌థానాయిక సుప్రియ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. శశి కిరణ్‌ టిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా, టీజీ విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అడివి శేష్ కథను అందించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాల సంగీత‌మందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ను అందాల తార స‌మంత ఈ రోజు (బుధ‌వారం) విడుద‌ల చేశారు.
టీజ‌ర్‌ను బ‌ట్టి.. దేశం కోసం, తండ్రి ఆశయం కోసం ‘రా’ ఆర్గనైజేషన్ లో చేరిన ఓ ఏజెంట్ (అడివి శేష్‌) చేసిన అడ్వంచరస్ నేప‌థ్యంలో ఈ గూఢచారి రూపొందింద‌ని తెలుస్తోంది. అలాగే ‘రా‌లో ఎందుకు జాయిన్‌ అవ్వాలనుకుంటున్నావ్‌.. మీ నాన్నలా అవుదామనా?’ అని అధికారి ప్రశ్నిస్తే.. ‘నాన్న బలం సర్.. కారణం కంట్రీ’ అంటూ అడివి శేష్ స‌మాధాన‌మివ్వ‌డం బాగుంది. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల అందించిన నేప‌థ్య సంగీతం ఈ టీజ‌ర్‌ను మ‌రింత ఎలివేట్ చేసింది. ఆగస్టు 3న  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here