వారందరి కోసమైనా క్యాన్సర్‌ను జయిస్తాను – సోనాలి బింద్రే

Actress Sonali Bindre Diagnosed With High Grade Cancer, Sonali Bendre diagnosed with cancer, Sonali Bendre diagnosed with high grade cancer, Sonali Bendre reveals she is battling high grade cancer, Sonali Bendre being treated for cancer in NY, #SonaliBendre, Telugu FilmNagar, Tollywood Actress Latest News,
Actress Sonali Bindre Diagnosed With High Grade Cancer
‘ప్రేమికుల రోజు’, ‘మురారి’, ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’లాంటి సూపర్ హిట్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన బాలీవుడ్ న‌టి సోనాలి బింద్రే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈమె.. ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతున్నారు. తాను హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్టు.. వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అందులో భాగంగా.. ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.
“కొన్ని సార్లు జీవితంలో మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి. అలాగే.. నాకు క్యాన్సర్ సోకుతుందని నేను కూడా ఊహించలేదు. తరచుగా అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు చేయించుకుంటే.. ఈ వ్యాధి గురించి తెలిసింది. అయితే.. ఈ విషయం తెలిసిన వెంటనే.. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు అండ‌గా నిలిచారు. ఇటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉండడం నా అదృష్టం. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే నా అభిమానులు ఎంతో మంది ఆత్మీయత‌తో కూడిన సందేశాలు పంపుతూ ఉంటే.. వారు నాపై చూపిస్తున్న ప్రేమకి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. వీరందరి కోసమైనా నేను ఈ క్యాన్సర్‌ను జయిస్తాను” అని ఆమె తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here