‘గీత గోవిందం’ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది

Geetha Govindam Movie Release Date Confirmed, Vijay Deverakonda's Geetha Govindam set for an August release, Geetha Govindam release date confirmed, #GeethaGovindam, Geetha Govindam on Aug 15, Vijay Devarakonda Geetha Govindam Movie Updates, Vijay Deverakonda and Rashmika Mandanna, Geetha Govindam, Telugu FilmNagar, Telugu cinema news, Telugu Movies Updates
Geetha Govindam Movie Release Date Confirmed

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టించిన‌ చిత్రం ‘గీత గోవిందం‘. ప‌రశురామ్ ద‌ర్శ‌కుడు. ప్ర‌ముఖ నిర్మాత‌ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాని జిఎ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీ వాస్ నిర్మించారు. గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల‌ విడుద‌ల చేసిన‌ ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఆగ‌స్టు 15న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఈ రోజు (మంగ‌ళ‌వారం) అధికారికంగా ప్ర‌క‌టించింది.

గీత అనే అమ్మాయి, గోవిందం అనే అబ్బాయి మ‌ధ్య సాగే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా కోసం.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందన్న‌ తొలి సారి జంట‌గా న‌టించారు. ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే ఇదే కాంబినేష‌న్‌లో ‘డియ‌ర్ కామ్రేడ్’ పేరుతో సోమ‌వారం మ‌రో చిత్రం కూడా ప్రారంభ‌మ‌వ్వ‌డం విశేషం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here