బ‌యోపిక్ కోసం సుమంత్‌ను ఎంపిక చేసిన క్రిష్‌?

Sumanth in NTR Biopic, Sumanth As ANR In NTR Biopic, Sumanth to play ANR in NTR Biopic, Sumanth steps into ANR shoes, Key Changes in NTR Biopic, NTR Biopic Cast, Is Sumanth the right choice for ANR, Actors In Ntr Biopic, #NTRBiopic, Telugu FilmNagar, Tollywood Film News 2018
Sumanth As ANR In NTR Biopic

తెలుగు సినీ పరిశ్రమకి రెండు కళ్ళు లాంటి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్. ఇప్పుడు అందులో ఒక దిగ్గజ నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘యన్.టి.ఆర్’ పేరుతో..ఆయన తనయుడు బాలకృష్ణ బ‌యోపిక్‌ను నిర్మిస్తూ, న‌టిస్తున్న‌ విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ సినీ జీవితంలో ఏఎన్నార్ పాత్ర కూడా చాలా కీలకమని చెప్పాలి. ఇప్పుడు ఇటువంటి కీలకపాత్ర కోసం ఏఎన్నార్ మనవడు సుమంత్‌ను ఎంపిక చేసినట్టు భోగ‌ట్టా. త‌న కెరీర్ ప్రారంభంలో సుమంత్ చేసిన సినిమాలను స్పష్టంగా గ‌మ‌నిస్తే…సుమంత్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి హావభావాలు వరకు ఏఎన్నార్‌నే గుర్తుచేస్తూ ఉంటాయి. బహుశా ఇవి ప‌రిశీలించే.. దర్శకుడు క్రిష్.. సుమంత్‌ను ఎంపిక చేసి ఉండొచ్చు.

ఈ పాత్రకు ముందుగా ఏఎన్నార్ మరో మనవడు నాగ చైతన్యను అనుకుంటున్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాని సుమంత్‌నే ఫైనల్ చేసినట్టుగా సమాచారం. ఇంతవరకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే చేస్తూ వచ్చిన సుమంత్.. ఇప్పుడు తాతగారి పాత్రలో నటించే అవకాశం పొందితే.. తప్పకుండా అది తన కెరీర్‌కి బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ అవుతుందని సుమంత్ సన్నిహితులు చెబుతున్నారు.

కాగా.. సుమంత్ నటించిన ‘ఇదం జగత్’ విడుదలకు సిద్ధం కాగా.. 25వ‌ చిత్రం ‘సుబ్రమ‌ణ్యపురం’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here