జూలై 11 నుంచి సాహో త‌దుప‌రి షెడ్యూల్‌

Sahoo Third Schedule Details, Sahoo Movie Next Schedule in Hyderabad, Sahoo started next schedule, Sahoo Movie Update, Sahoo Shooting Schedule Revealed, Prabhas Saahoo Movie, Telugu FilmNagar, Latest Telugu Movie News, Tollywood Updates 2018,
Sahoo Third Schedule Details

బాహుబ‌లి‘ సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘సాహో’. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సుజీత్ ద‌ర్శ‌కుడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్  ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ అబుదాబిలో పూర్త‌య్యింద‌ని.. మూడో షెడ్యూల్‌ను జూలై 11 నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది.

నీల్ నితిన్ ముఖేష్‌, ఎవ‌లెన్ శ‌ర్మ‌, లాల్‌, అరుణ్ విజ‌య్‌, మందిరా బేడి, వెన్నెల కిషోర్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, చుంకీ పాండే త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకి శంక‌ర్-ఎహ‌సాన్-లాయ్ సంగీత‌మందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here