ఆస‌క్తిక‌రంగా ఆట‌గాళ్ళు ట్రైల‌ర్‌

Nara Rohit Aatagallu Trailer Out Now, Nara Rohit Aatagallu Trailer Review, Aatagallu Trailer, Aatagallu Movie Trailer Review, Nara Rohit Aatagallu Trailer, Telugu Cinema Updates, Latest Telugu Movie News 2018, Nara Rohit and Jagapathi Babu Aatagallu Movie
Nara Rohit Aatagallu Trailer Out Now

నారా రోహిత్‌, జ‌గ‌ప‌తిబాబు, ద‌ర్శ‌న బానిక్‌, సుబ్బ‌రాజు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం ‘ఆట‌గాళ్ళు‘. గేమ్ ఫ‌ర్ లైఫ్ అనేది దీనికి ఉప‌శీర్షిక‌. ప‌రుచూరి ముర‌ళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వాసిరెడ్డి ర‌వీంద్ర‌నాథ్‌, వాసిరెడ్డి శివాజీ ప్ర‌సాద్‌, మ‌క్కెన రాము, వ‌డ్ల‌పూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మించారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న‌ ఈ సినిమా.. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజు (శ‌నివారం) విడుద‌ల చేశారు.

సినిమా డైరెక్ట‌ర్‌ అయిన నారా రోహిత్ ఓ హ‌త్యకు సంబంధించిన కేసులో ఎలా ఇరుక్కున్నాడు? దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా? లేదా? అనే అంశాల‌తో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్లుగా ట్రైల‌ర్ ద్వారా అర్థ‌మవుతోంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్, రొమాన్స్‌, స‌స్పెన్స్‌.. ఇలా అన్ని అంశాల‌ను ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా మేళ‌వించారు.
ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీత‌మందించ‌గా.. విజ‌య్ సి.కుమార్ ఛాయాగ్ర‌హ‌ణం అందించారు. జూలై నెల‌లో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here