య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌లో కీర్తి సురేష్‌?

Actress Keerthy Suresh Latest News, Heroine Keerthy Suresh Upcoming Movie News, Keerthy Suresh as Savitri in NTR Biopic, Latest Telugu Movies News, NTR Movie Updates, NTR Telugu Movie Latest News, once again keerthi suresh as mahanati savitri, once again keerthi suresh as mahanati savitri in ntr biopic, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Keerthy Suresh as Savitri in NTR Biopic

మ‌హాన‌టి సావిత్రి.. ఓ త‌రం జ్ఞాప‌కం. అలాంటి సావిత్రి పాత్ర‌లో ఓసారి న‌టించ‌డ‌మే అపురూప‌మైన అవ‌కాశ‌మైతే.. మ‌ళ్ళీ వేరే బ‌యోపిక్ కోసం అదే పాత్ర‌లో న‌టించే అరుదైన అవ‌కాశం కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌కు ద‌క్కింద‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ‌హాన‌టుడు, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా ‘య‌న్‌.టి.ఆర్‘ పేరుతో ఓ బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న ఈ సినిమాకి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో.. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అతిథి పాత్ర‌లు పోషించ‌నున్నారు. ఈ విష‌యంపై అధికారికంగా ఎవ‌రి పేర్లు బ‌య‌టకి రాక‌పోయినా.. ఫ‌లానా పాత్ర‌లో ఫ‌లానా ఆర్టిస్ట్ న‌టిస్తున్న‌ట్లు ప‌లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

తాజాగా.. ఈ జాబితాలో కీర్తి సురేష్ కూడా చేరారు. ‘మ‌హాన‌టి’లో సావిత్రి పాత్ర‌లో జీవించేసిన కీర్తి న‌ట‌న‌కు ముగ్ధులైన ‘య‌న్.టి.ఆర్’ టీమ్.. ఎన్టీఆర్ సినీ ప్ర‌యాణంలో కీల‌క పాత్ర పోషించిన సావిత్రి పాత్ర‌కి కీర్తి అయితేనే క‌రెక్ట్ అని ఆమెని సంప్ర‌దించార‌ట‌. కీర్తి కూడా మ‌రోసారి సావిత్ర‌మ్మ పాత్ర చేసేందుకు సిద్ధ‌మేన‌ని.. త‌న‌ అంగీకారం తెలిపార‌ని స‌మాచారం. ‘య‌న్‌.టి.ఆర్’ బ‌యోపిక్‌లో కీర్తి ఎంట్రీపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.

ఇదిలా ఉంటే.. జూలై 5 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ బ‌యోపిక్ సంక్రాంతి కానుక‌గా తెర‌పైకి రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here