ఫ‌స్ట్ సాంగ్ షూటింగ్‌లో అఖిల్ 3

Akhil 3 Movie First Song Shoot Updates, Akhil Movie Latest Updates, Akhil Akkineni New Movie Updates, #Akhil3 First Song Shooting, #Akhil3 first song shoot, #Akhil3 shoot in London, Telugu FilmNagar, Tollywood Film News, Telugu Cinema Updates 2018
Akhil 3 Movie First Song Shoot Updates

యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్ హీరోగా ‘తొలి ప్రేమ‘ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ లండ‌న్‌లో జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన చిత్ర యూనిట్‌.. ప్ర‌స్తుతం పాట చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ మాస్ట‌ర్ ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ గీతం సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా.. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లోగానీ లేదంటే డిసెంబ‌ర్‌లో గానీ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌చ్చు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here