సాక్ష్యం ఆడియో ఎప్పుడంటే

Saakshyam Audio Release Date Fixed, Saakshyam Audio Release Date Locked, Saakshyam Audio Release Date Confirmed, Saakshyam Audio Release Date and Venue Locked, Bellamkonda Sai Srinivas Saakshyam Movie Release Date,Latest Telugu Movie News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Saakshyam Audio Release Date Locked

అల్లుడు శీను‘ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌.. అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ‌తేడాది విడుద‌లైన ‘జ‌య జాన‌కి నాయ‌క‌’తో మాస్ ఆడియ‌న్స్‌కు ద‌గ్గ‌రైన శ్రీ‌నివాస్‌.. ప్ర‌స్తుతం ‘ల‌క్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నారు. ఆ చిత్ర‌మే ‘సాక్ష్యం’.

నేచ‌ర్ ఈజ్ ద విట్‌నెస్ అనేది దీనికి ట్యాగ్ లైన్‌. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్ కుమార్‌, మీనా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఏస్ రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా జూలై 20న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే..

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌ను జూలై 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ట్రైల‌ర్‌తో ఇప్ప‌టికే అంచ‌నాల‌ను పెంచేసిన ఈ సినిమా.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచే మూవీ అవుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here