వ‌రుణ్ తేజ్ చిత్రంలో రెహ‌మాన్‌?

Rahman in Varun Tej film, Rahman on board for Sankalp Reddy and Varun Tej film, Varun Tej and Sankalp Reddy Movie First Look, Varun Tej upcoming movie News, Telugu FilmNagar, sankalp reddy next movie, Varun Tej Space Movie, Upcoming Telugu Movies 2018, Varun Tej and Sankalp Reddy Movie Title,
Rahman in Varun Tej film
‘ఫిదా’, ‘తొలిప్రేమ’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్‌. ప్ర‌స్తుతం ఈ మెగా హీరో.. రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. వాటిలో ఒక‌టి.. సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌ తో క‌లిసి న‌టిస్తున్న ‘ఎఫ్ 2‘ కాగా.. మ‌రొక‌టి ‘ఘాజీ’ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డి రూపొందిస్తున్న స్పేస్ థ్రిల్ల‌ర్‌. అదిత్ రావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్లుగా న‌టిస్తున్న
ఈ స్పేస్ మూవీలో వ‌రుణ్ వ్యోమ‌గామిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.
అలాగే స్పేస్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ పాత్ర‌లో ఒక‌ప్ప‌టి క‌థానాయ‌కుడు రెహ‌మాన్ (ర‌ఘు) క‌నిపించ‌నున్నారని స‌మాచారం. కాగా.. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, టైటిల్‌ను జూలై మూడో వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. క్రిష్‌, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here