ఈ న‌గ‌రానికి ఏమైంది? .. స్టైలిష్‌, ట్రెండీ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్

#EeNagaranikiEmaindi, Ee Nagaraniki Emaindi Movie Review, Ee Nagaraniki Emaindi Movie Review And Rating, Ee Nagaraniki Emaindi Movie Story, Ee Nagaraniki Emaindi Movie Updates, Ee Nagaraniki Emaindi Review, Ee Nagaraniki Emaindi Telugu Movie Latest News, Ee Nagaraniki Emaindi Telugu Movie Live Updates, Ee Nagaraniki Emaindi Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Ee Nagaraniki Emaindi Movie Review

చిత్రం: ఈ నగరానికి ఏమైంది?

న‌టీన‌టులు: విశ్వక్‌సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేష్ కాకుమాను, అనిషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి, గీతా భాస్క‌ర్‌, అతిథి పాత్ర‌ల్లో గౌత‌మ్ మీన‌న్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌

సంగీతం: వివేక్ సాగర్

ఛాయాగ్ర‌హ‌ణం: నికేత్ బొమ్మి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: లతా త‌రుణ్‌

ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల

నిర్మాత: డి.సురేష్ బాబు

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ద‌ర్శ‌క‌త్వం: తరుణ్ భాస్కర్

విడుద‌ల తేది: 29  జూన్ 2018

ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్ట‌ప‌డే న‌లుగురు కుర్రాళ్ళు.. వారి జీవితంలోని కొన్ని జ్ఞాప‌కాలు, అనుభూతులు.. ఇలా సింపుల్ పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్రం ‘ఈ న‌గ‌రానికి ఏమైంది?‘.  బ‌డ్డీ కామెడీ అనే జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాని ‘పెళ్ళిచూపులు’తో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత డి. సురేష్ బాబు నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ శుక్ర‌వారం తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమాపై ‘తెలుగుఫిల్మ్‌న‌గ‌ర్‌.కామ్’ అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థాంశం

కార్తిక్ (సుశాంత్ రెడ్డి), వివేక్ (విశ్వ‌క్‌సేన్ నాయుడు), ఉపేంద్ర (వెంక‌టేష్ కాక‌మాను), కౌశిక్ (అభిన‌వ్ గోమ‌తం).. మంచి స్నేహితులు. ఈ  న‌లుగురికీ ఫిల్మ్‌మేకింగ్ అంటే ఇష్టం. క‌ళాశాల‌ రోజుల్లోనే.. వివేక్ డైరెక్ష‌న్‌, కౌశిక్ యాక్టింగ్‌, కార్తిక్ కెమెరా, ఉప్పు ఎడిటింగ్ విభాగాలు ఎంచుకుని ఓ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసుకుంటారు. అయితే.. షార్ట్ ఫిల్మ్ కోసం హీరోయిన్‌గా శిల్ప (సిమ్రాన్ చౌద‌రి)ను ఎంచుకున్న వివేక్.. ఆమెతో ప్రేమ‌లో ప‌డతాడు. త‌న యాటిట్యూడ్‌ వ‌ల్ల వివేక్ ప్రేమ భ‌గ్న‌మ‌వుతుంది. అది కాస్త‌ వివేక్‌ను బాగా డిస్ట్ర‌బ్‌కు గురిచేస్తుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో.. ఈ గ్యాంగ్‌కు షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించి మంచి ఆఫ‌ర్ వ‌స్తుంది. అయితే.. ల‌వ్ స్టోరీస్ మాత్రం చేయ‌నంటూ మొండిప‌ట్టు ప‌డ‌తాడు వివేక్. కారులో ప్రయాణం చేస్తూ.. ఇదే విష‌యంపై న‌లుగురి మ‌ధ్య డిస్క‌స్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. క‌ట్ చేస్తే.. నాలుగేళ్ళ త‌రువాత ఈ న‌లుగురు కార్తిక్ బ్యాచ్‌ల‌ర్ పార్టీ కోసం క‌లుస్తారు. అనూహ్యంగా గోవా వెళ్ళాల్సిన ప‌రిస్థితి.. షార్ట్ ఫిల్మ్ చేయాల్సిన సంద‌ర్భం వ‌స్తుంది. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల స‌మాహార‌మే ఈ చిత్రం.

విశ్లేష‌ణ‌

విభిన్న మ‌నస్త‌త్వాలున్న న‌లుగురు స్నేహితులు, వారి స్నేహ ప్ర‌యాణం చుట్టూ అల్లుకున్న క‌థ ఇది. ఏదో సినిమా చూస్తున్న‌ట్లుగా కాకుండా.. న‌లుగురు ఫ్రెండ్స్ ఓ చోట‌ క‌లిస్తే ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో, ఎలా మాట్లాడుకుంటారో.. స‌రిగ్గా అలాంటి వాటినే తెరపై చూస్తున్న‌ట్లుగా ఉంటుంది. ప్ర‌ధానంగా ఈ సినిమా స‌ర‌దాగా సాగినా.. అక్క‌డ‌క్క‌డ ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. ముఖ్యంగా వివేక్ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ సీన్‌ ఎంత ఫ‌న్నీగా ఉంటుందో.. బ్రేక్ అప్ సీన్‌ అంత ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. అలాగే క్లాస్‌కు డుమ్మా కొట్టే సీన్‌, గోవాలో మందు తాగిన వివేక్ ముందు కౌశిక్ న‌వ్వుతూ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చే సీన్‌.. ఇలా కొన్ని స‌న్నివేశాలు న‌వ్వు తెప్పిస్తాయి. అయితే.. ఫ‌స్టాఫ్‌లో ఉన్న స్పీడ్‌.. సెకండాఫ్‌లో క‌నిపించ‌క‌పోవ‌డం ఈ సినిమాకు కాస్త మైన‌స్ అయ్యింద‌నే చెప్పాలి. ఓవ‌రాల్‌గా.. ఈ త‌రానికి చెందిన యువ‌త‌ను ల‌క్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రం వారిని ఏ మాత్రం నిరాశ‌ప‌ర‌చ‌లేద‌నే చెప్పాలి.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. విశ్వక్‌సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేష్ కాకుమాను, అనిషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి.. ఇలా అంద‌రూ కూడా బాగా చేశారు. ముఖ్యంగా అభిన‌వ్ గోమంత కామెడీ ఈ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అత‌ని కామెడీ టైమింగ్ చూస్తే.. మ‌రో మంచి కమెడియ‌న్ తెలుగు సినిమాకి దొరికిన‌ట్టే అని చెప్పాలి. ఇక‌.. అతిథి పాత్ర‌ల్లో గౌత‌మ్ మీన‌న్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ మెరిసారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. వివేక్ సాగ‌ర్ సంగీతంలో “ఆగి ఆగి” అనే పాట విన‌సొంపుగా ఉంది. అలాగే మిగిలిన పాట‌లు కూడా సంద‌ర్భోచితంగా సాగుతూ.. అల‌రిస్తాయి. ఇక నేప‌థ్య సంగీతం.. సినిమా మూడ్‌కు త‌గ్గ‌ట్టుగా ఆహ్లాదంగా సాగింది. నికేత్ బొమ్మి ఛాయాగ్ర‌హ‌ణం సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళింది. ముఖ్యంగా గోవా అందాల‌ను ఆవిష్క‌రించిన విధానం బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్న‌ప్ప‌టికీ.. సెకండాఫ్‌లో కొన్ని స‌న్నివేశాల‌పై దృష్టి పెట్టాల్సింది అనిపించింది. ఈ సినిమాకి బాగా ప్ల‌స్ అంటే డైలాగ్స్ అనే చెప్పాలి. సంభాష‌ణ‌ల‌న్నీ కూడా స‌హ‌జంగా ఉన్నాయి.   “క్లబ్ ఈజ్ యువర్స్, గర్ల్ ఈజ్ యువర్స్, హెడ్ ఏక్ ఆల్సో యువర్స్”, “నా దోస్త్ ఎవరో.. నువ్వు వెడ్డింగ్ వీడియోస్‌లో జేమ్స్ కామెరూన్ అన్నాడు”, “3 మినిట్స్‌లో 30 థ్రిల్లర్ మూవీస్ చూపించాడు” .. ఇలా ఎన్నో ఫ‌న్నీ డైలాగులు అల‌రిస్తాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌

కాన్సెప్ట్‌
న‌టీన‌టులు
ద‌ర్శ‌క‌త్వం
సంగీతం
ఛాయాగ్ర‌హ‌ణం
సంభాష‌ణ‌లు
నిర్మాణ విలువ‌లు
ప్ర‌థ‌మార్థం

మైన‌స్ పాయింట్స్‌
స్లో నేరేష‌న్‌
ద్వితీయార్థం

బాట‌మ్ లైన్‌: స్టైలిష్‌, ట్రెండీ బ‌డ్డీ ఎంట‌ర్‌టైన‌ర్‌

ఈ న‌గ‌రానికి ఏమైంది? రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performances
3.3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here