వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌?

Vakkantham Vamsi to Team Up with Ravi Teja?,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Vakkantham Vamsi Next With Ravi Teja,Director Vakkantham Vamsi Upcoming Projects,Mass Maharaja Ravi Teja New Movie Updates,Ravi Teja Next with Vakkantham Vamsi
Vakkantham Vamsi to Team Up with Ravi Teja?

మాస్ మహారాజా రవితేజ చిత్రాలను ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకోవచ్చు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేస్డ్ ఫిల్మ్స్‌తో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు రవితేజ. అందులో ఒక‌ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘కిక్’. 2009లో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్‌కి వక్కంతం వంశీ కథను అందించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ‘కిక్’ త‌రువాత ర‌వితేజ‌, వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్‌లో ‘కిక్ 2’, ‘ట‌చ్ చేసి చూడు’ వ‌చ్చాయి. ఆ సినిమాలు ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. అతి త్వ‌ర‌లో ఈ కాంబో మ‌రో సినిమా కోసం క‌లిసి ప‌నిచేయ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే.. ఈ సారి వంశీ ర‌చ‌యిత‌గా మాత్ర‌మే కాకుండా ద‌ర్శ‌కుడిగానూ ర‌వితేజ‌తో జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ని తెలిసింది. అల్లు అర్జున్‌ హీరోగా తెర‌కెక్కిన‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కోసం తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకున్న వక్కంతం వంశీకి ద‌ర్శ‌కుడిగా ఇది రెండో సినిమా అవుతుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌స్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here