మ‌హేష్ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌?

#MB25, Latest Tollywood Updates, Mahesh Babu 25 Movie Updates, Mahesh Babu 25th Movies Songs, Mahesh Babu Latest News, Special Song Plans for Mahesh Babu 25th Film, Superstar Mahesh Babu Upcoming Movie News, Telugu Filmnagar, Telugu movie News 2018
Special Song Plans For Mahesh Babu 25th Film

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ భ‌లేగా క్లిక్ అవుతాయి. ‘పోకిరి’లోని ”ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే”.. ‘అతిథి’ చిత్రంలోని ‘రాత్రైనా నాకు ఓకే”.. ‘దూకుడు’లోని ”పువ్వై పువ్వై”.. ‘బిజినెస్‌మేన్‌’లోని ”బ్యాడ్ బోయ్స్‌”.. ‘1 నేనొక్క‌డినే’లోని ”లండ‌న్ బాబు”.. ‘ఆగ‌డు’లోని ”జంక్ష‌న్‌లో..”.. ఎంత పాపుల‌ర్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే.. ‘ఆగ‌డు’ త‌రువాత మ‌రే మ‌హేష్ చిత్రంలోనూ ప్ర‌త్యేక గీతం వినిపించ‌లేదు, క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో.. మ‌హేష్ 25తో ఆ లోటు తీర‌బోతుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో స‌బ్జెక్ట్ డిమాండ్ మేర‌కు సెకండాఫ్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్ వ‌స్తుంద‌ని.. ఇందులో ఓ అగ్ర క‌థానాయిక సంద‌డి చేసే అవ‌కాశ‌ముంద‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌క‌ర్త‌. వ‌చ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here