ద‌స‌రాకి ప్రారంభం కానున్న మ‌హేష్‌, సుకుమార్ చిత్రం?

Mahesh Babu And Sukumar To Team Up Again, Mahesh Babu upcoming Movies, Mahesh Babu Sukumar New Movie Updates, Latest Telugu Movies News 2018, Mahesh Babu Latest News, Telugu FilmNagar, Sukumar Next Movie updates, Mahesh Babu Next Movie
Mahesh Babu And Sukumar To Team Up Again

‘1 నేనొక్కడినే’ త‌రువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని ఈ ఏడాది ద‌స‌రాకి లాంచ్ చేసేందుకు దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. అలాగే.. వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొద‌లుపెట్టేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇదిలా ఉంటే.. స్ట్రెయిట్ స్టోరీస్ కంటే కాంప్లికేటెడ్ కథలకే ప్రాధాన్యతనిచ్చే సుక్కు.. మహేష్ కోసం ఓ థ్రిల్లింగ్ రివేంజ్ స్టొరీను సిద్ధం చేసారని సమాచారం. అయితే.. ‘1 నేనొక్కడినే’ సినిమా త‌ర‌హాలోనో లేదంటే సుకుమార్ గ‌త చిత్రం రంగ‌స్థ‌లం మాదిరిగానో హీరో క్యారెక్ట‌ర్ కాంప్లికేటేడ్‌గా కాకుండా.. ఓ సాధార‌ణ యువ‌కుడి పాత్రగానే ఉంటుంద‌ని స‌మాచారం. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించ‌నున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

ప్రస్తుతం.. మహేష్ తన సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం) షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here