ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా బాహుబలి ది కన్‌క్లూజన్

International Award For Baahubali 2, Baahubali 2 wins a prestigious international award, Bahubali 2 Wins International Award, Baahubali 2 Movie awards, BB 2 Bags International Award, Telugu cinema news, Telugu Movies Updates 2018, Trendsetter Movies in Telugu, Telugu FilmNagar
International Award For Baahubali 2

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ విజువల్ వండర్‌గా ప్రపంచ సినీ ప్రేమికులను అలరించింది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే గ్రాఫిక్స్‌తో పాటు భావోద్వేగమైన సన్నివేశాలతో ఆకట్టుకున్న ఈ చిత్రం.. ఒక్క ఇండియాలోనే గాక వరల్డ్ వైడ్‌గా రూ.1500 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ‘బాహుబలి:ది బిగినింగ్’, ‘బాహుబలి:ది కన్‌క్లూజన్’.. ఇలా రెండు భాగాలుగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇప్పటికే జాతీయంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న‌ ఈ సినిమా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా అవార్డుల వేట ప్రారంభించింది.

ఏటా వివిధ జోనర్‌లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలకు అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిలిమ్స్ అనే సంస్థ శాటరన్ అవార్డులను అందజేస్తుంది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య విడుదలైన చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన వాటికి ఈ అవార్డులను ప్రదానం చేసింది. అందులో భాగంగా నిన్న (బుధవారం) జరిగిన 44వ శాటరన్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘బాహుబలి:ది కన్‌క్లూజన్’కు ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’గా అవార్డును అంద‌జేసింది. ఈ కేట‌గిరీలో ఆరు చిత్రాలు పోటీ పడగా ‘బాహుబలి:ది కన్‌క్లూజన్’కు అవార్డు రావడం విశేషం. ఇది మ‌న తెలుగు సినిమా స్టామినాకు నిద‌ర్శ‌నం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here