ఆట‌గ‌ద‌రా శివ సింగిల్ లాంఛ్ చేసిన‌ విక్ట‌రీ వెంక‌టేష్

Daggubati Venkatesh Launches Rama Rama Re from Aatagadharaa Siva,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Venkatesh Launched Rama Rama Re Song,Rama Rama Re Song from Aatagadharaa Siva,Aatagadharaa Siva Movie Songs,Rama Rama Re Full Song
Daggubati Venkatesh Launches Rama Rama Re from Aatagadharaa Siva

‘ఆ న‌లుగురు’, ‘మ‌ధుమాసం’, ‘అంద‌రి బంధువ‌యా’ చిత్రాల‌తో అభిరుచి గ‌ల‌ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్ర సిద్ధార్థ‌. ‘ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు’ (2014) త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌.. తాజాగా ఆట‌గ‌ద‌రా శివ పేరుతో ఓ కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీని తెర‌కెక్కించారు. దొడ్డ‌న్న‌, ఉద‌య్ శంక‌ర్‌, హైప‌ర్ ఆది త‌దిత‌రులు ముఖ్య‌ పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై రాక్‌లైన్ వెంక‌టేష్ నిర్మించారు. వాసుకి వైభ‌వ్ సంగీత‌మందించిన ఈ చిత్రానికి నోబిన్ పాల్ నేప‌థ్య సంగీత‌మందించారు. చిత్రీక‌ర‌ణ‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (గురువారం) రామ రామ రే అంటూ సాగే పాట‌ని సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్ లాంఛ్ చేశారు. ప్ర‌ముఖ సినీ జ‌ర్న‌లిస్ట్ పుల‌గం చిన్నారాయ‌ణ ర‌చించిన ఈ పాట‌ను సంగీత క‌త్తి, పూజ‌, బృంద గానం చేశారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుద‌లైన ఈ పాట విన‌గానే ఆక‌ట్టుకునేలా ఉంది.

కాగా.. జూలై 14న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here