బాల‌కృష్ణ సినిమా టైటిల్‌తో నాగ‌శౌర్య చిత్రం?

Actor Naga Shourya Next Film Updates, Balakrishna Title for Naga Shourya Next Project, Balakrishna Title To Naga Shaurya, Hero Naga Shourya Upcoming Movie News, Latest Telugu Movies News, Naga Shourya New Movie Title, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates

నారీ నారీ న‌డుమ మురారి.. 1990లో వ‌చ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌ట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన ఈ సినిమా టైటిల్‌తో.. ఇప్పుడు మ‌రో సినిమా రాబోతోంది. ‘ఛ‌లో’తో సక్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నారు. రాజా కొలుసు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్న ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా.. ఆగ‌స్టు నుంచి నిర‌వ‌ధిక చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. ఇందులో నాగ‌శౌర్య స‌ర‌స‌న ఇద్ద‌రు క‌థానాయిక‌లు న‌టిస్తున్నార‌ని.. క‌థానుసారం ‘నారీ నారీ న‌డుమ మురారి’ టైటిల్ అయితే బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌పై క్లారిటీ వ‌స్తుంది. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య‌.. ‘@న‌ర్త‌న శాల’ అనే సినిమా చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా ఆగ‌స్టులో తెర‌పైకి రానుంది. ఈ రెండు చిత్రాల‌కూ ‘ఛ‌లో’ ఫేమ్ మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీత‌మందిస్తుండ‌డం విశేషం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here