సంక్రాంతికి అజిత్‌, న‌య‌న‌తార సంద‌డి

Ajith Viswasam Releasing on Sankranti 2019,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Viswasam Movie Releasing on Sankranti,Viswasam Movie Updates,Ajith Viswasam Movie Release Date,Viswasam Movie Release Date Fixed,Ajith New Movie Updates,సంక్రాంతికి అజిత్‌, న‌య‌న‌తార సంద‌డి
Ajith Viswasam Releasing on Sankranti 2019

‘వీరమ్’, ‘వేదాళ‌మ్’, ‘వివేగమ్’ లాంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, దర్శకుడు శివ. ప్ర‌స్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో.. నాలుగో చిత్రంగా ‘విశ్వాసమ్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై అర్జున్ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్‌ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్నారు. గతంలో అజిత్, నయనతార కలిసి ‘బిల్లా’, ‘ఏగన్’, ‘ఆరంభం’ సినిమాలలో జోడీగా న‌టించారు. ఇప్పుడు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఇలా హిట్ కాంబినేషన్స్‌తో కలిసి నాలుగోసారి అజిత్ జట్టు కట్టనుండడంతో ఈ సినిమాపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

అలాగే.. ఈ సినిమాలో హాస్య నటులు కోవై సరళ, వివేక్, యోగి బాబు, తంబి రామయ్య నటిస్తుండడంతో కామెడీకి పెద్ద పీట వేయనున్నట్టు అర్ధమవుతోంది.ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింద‌ట‌. అయితే ఇంతవరకు 40 శాతం చిత్రీకరణ మాత్రమే పూర్తయిన కార‌ణంగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగులోనూ ఈ సినిమా విడుద‌ల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here