జూన్ 29 @ 11 చిత్రాలు

11 Movies gearing up for release on June 29, 2018 June Movies, Ee Nagaraniki Emaindi Movie, Sanjeevani, Sanju Telugu Movie, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Movies Releasing this Week, Upcoming Telugu Movies 2018
జూన్ 29 @ 11 చిత్రాలు
ఒక నెల మొత్త‌మ్మీద రిలీజ్ అవ‌న‌న్ని సినిమాలు.. ఒకే రోజున రిలీజ్ అవడం ఆరోగ్య‌క‌ర‌మైన‌, ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామమేనా?  ఏ మాత్రం కాదు. కానీ.. నిస్స‌హాయం, అనివార్యమూ అయిన ప‌రిస్థితుల్లో ఇలా మూకుమ్మ‌డి రిలీజ్‌ల‌కు సిద్ధ‌పడ్డ నిర్మాత‌ల‌ను చూసి జాలి ప‌డ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేం. జ‌న‌వ‌రిలో పెద్ద సినిమాల సంద‌డి పూర్త‌య్యేదాకా వెయిట్ చేసి చేసి ఫిబ్ర‌వ‌రిలో వెయిటింగ్ లిస్ట్ మొత్తం విడుద‌లైపోతుంది. అందుకే.. మంచి సీజ‌న్ కాక‌పోయినా ఫిబ్ర‌వ‌రిలో సంఖ్యాప‌రంగా అత్య‌ధిక రిలీజ్‌లు ఉంటాయి. ఆ త‌రువాత సినిమాల‌కు బ్యాడ్ సీజ‌న్ జూన్, జూలై నెల‌ల స‌మ‌య‌మే. సెల‌వులు అయిపోయి టూర్లు ముగిశాక.. స్కూళ్ళు తెరిచాక.. పిల్ల‌ల పుస్తకాలు, యూనిఫామ్‌ల‌కే జేబులు ఖాళీ అయిపోయిన టైమ్‌కే.. పెద్ద సినిమాల ఒత్తిడి లేకుండా జూన్‌, జూలై నెల‌ల‌కి పోతుంటారు చిన్న నిర్మాత‌లు. అలా పేరుకుపోయిన 11 సినిమాలు ఒకే రోజున (జూన్ 29న‌) రిలీజ‌వ‌డం ఒక రికార్డుగా నిలిచిపోతుందే కానీ.. స‌ద‌రు నిర్మాత‌ల సేఫ్టీకి మాత్రం ఎలాంటి భ‌రోసా ఉండదు. అయితే ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ చేయ‌లేము అన్న‌ట్లుగా ఉన్న నిర్మాత‌ల ప‌రిస్థితిని సానుభూతితో చూడాల్సిన అవ‌స‌రం ఉంది. ఇంత‌కు జూన్ 29న విడుద‌ల కానున్న సినిమాల లిస్ట్ చూస్తే.. 2, 3 సినిమాలు త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ అష్ట‌క‌ష్టాల‌ను ఎదుర్కొని భారీ న‌ష్టాల‌ను చ‌విచూడ‌బోతున్నవే. అయితే.. జ‌యాప‌జ‌యాల‌ను ముందే చెప్ప‌టం స‌మంజ‌సం కాదు కాబ‌ట్టి.. ఆ 11 సినిమాల జాబితా ఇస్తున్నాం. వాటిలో ఏది హిట్టో.. ఏది ఫ‌ట్టో మీరే ఊహించుకోండి.

 

జూన్ 29న విడుద‌ల కానున్న 11 సినిమాల (8 స్ట్ర‌యిట్‌, 3 డ‌బ్బింగ్ చిత్రాల‌) లిస్ట్‌
1. ఈ న‌గరానికి ఏమైంది?
2. శంభో శంక‌ర‌
3. సంజీవ‌ని
4. ఐ.పి.సి.సెక్ష‌న్ భార్యాబంధు
5. క‌న్నుల్లో నీ రూప‌మే
6 .మిస్ట‌ర్ హోమానంద్‌
7. సూప‌ర్ స్కెచ్‌
8. నా ల‌వ్ స్టోరీ
9.  యుద్ధ భూమి (డ‌బ్బింగ్‌)
10. ఎస్కేప్ ప్లాన్ 2 (డ‌బ్బింగ్‌)
11. సంజు (డ‌బ్బింగ్‌)
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here