ఈ న‌గ‌రానికి ఏమైంది?.. గెస్ట్ రోల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda Guest Role in Ee Nagaraniki Emaindi,TeluguFilmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Ee Nagaraniki Emaindi Movie Updates,Ee Nagaraniki Emaindi Telugu Movie Latest News,Hero Vijay Deverakonda Character In Ee Nagaraniki Emaindi Movie
Vijay Deverakonda Guest Role in Ee Nagaraniki Emaindi

యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండకు సోలో హీరోగా తొలి విజ‌యాన్ని అందించిన చిత్రం ‘పెళ్ళి చూపులు‘. ఈ సినిమా ద్వారా త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్ అవ్వ‌డ‌మే కాకుండా.. ప‌లు అవార్డుల‌ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుద‌లైన రెండేళ్ళ‌కు త‌న రెండో చిత్రంలో ప‌ల‌క‌రించ‌నున్నారు త‌రుణ్ భాస్క‌ర్‌. ‘ఈ న‌గ‌రానికి ఏమైంది?’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ బ‌డ్డీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో విశ్వ‌స్ సేన్‌, అనీషా అంబ్రోసి, సుశాంత్ రెడ్డి, వెంక‌టేష్ క‌కుమాను, అభిన‌వ్ గోమ‌త‌మ్‌, సిమ్రాన్ చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ స్వ‌రాలందించారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌తో ఇప్ప‌టికే అంచ‌నాలు పెంచేసిన ఈ సినిమా.. ఈ నెల 29న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. త‌రుణ్ భాస్క‌ర్ తొలి చిత్ర క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. ప‌తాక స‌న్నివేశాల్లో క‌నిపించే ఈ పాత్ర సినిమాకి ప్ల‌స్ అవుతుంద‌ని స‌మాచారం. మ‌రి.. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో మ‌రో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here