య‌న్‌.టి.ఆర్‌లో భారీ తారాగ‌ణం

Krish Jagarlamudi NTR Biopic Updates, Latest Telugu Film News, Nandamuri Balakrishna NTR Biopic Terrific Cast Finalised, NTR Biopic Cast and Crew, NTR Biopic Casting Details, Ntr Biopic Latest News, NTR Biopic Release Date Confirmed, NTR Biopic Released On January 9th, Telugu Filmnagar, Telugu movie News 2018, Tollywood Cinema Updates
య‌న్‌.టి.ఆర్‌లో భారీ తారాగ‌ణం

మ‌హాన‌టుడు, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘య‌న్‌.టి.ఆర్‌’. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్న ఈ సినిమాకి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఎం.ఎం.కీర‌వాణి స్వ‌ర‌క‌ర్త‌. జూలై 5 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బసవతారకం పాత్రలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి విద్యాబాలన్ న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అలాగే నారా చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా క‌నిపించ‌నున్నారు. వీరితో పాటు కొంద‌రు ప్ర‌ముఖ న‌టులు క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా అతిథి పాత్ర‌ల్లో మెర‌వ‌నున్నార‌ని స‌మాచారం. ఏఎన్నార్‌ పాత్ర కోసం ఆయ‌న మ‌నవ‌డు నాగచైతన్య.. కృష్ణ పాత్ర‌లో ఆయ‌న త‌న‌యుడు మహేష్‌ బాబు క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అలాగే నందమూరి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే సీనియ‌ర్ న‌టుడు మోహన్‌బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.
అలాగే సీనియ‌ర్ క‌థానాయ‌కుడు రాజశేఖర్‌, యువ క‌థానాయుడు శర్వానంద్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయ‌ని తెలుస్తోంది. అంతేగాకుండా.. మరికొన్ని పాత్రల కోసం బెంగాలీ నుంచి నాటక రంగంలో ఉద్దండులైన వారిని నటింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. కొన్ని పాత్రల కోసం ద‌ర్శ‌కుడు క్రిష్ ఆడిషన్స్ కూడా నిర్వ‌హిస్తున్నార‌ట‌. మొత్తానికి.. ‘య‌న్‌.టి.ఆర్’ బ‌యోపిక్ భారీ తారాగ‌ణంతోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌న్న‌మాట‌.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here