ఎవ‌రో ఒక‌రు చేసిన‌ త‌ప్పుని మొత్తం ప‌రిశ్ర‌మ‌కు ఆపాదించ‌డం స‌రికాదు.. మెహ‌రీన్‌

Mehreen Expresses Concerns against Ongoing Scandal in Tollywood,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Latest Telugu Movie News,Tollywood Scandal,Tollywood Celebrities About Ongoing Scandal,Tollywood Actress about US Scandal,Mehreen Pirzada Clarifies on US Scandal,ఎవ‌రో ఒక‌రు చేసిన‌ త‌ప్పుని మొత్తం ప‌రిశ్ర‌మ‌కు ఆపాదించ‌డం స‌రికాదు.. మెహ‌రీన్‌
Mehreen Expresses Concerns against Ongoing Scandal in Tollywood

అమెరికాలో తాజాగా వెలుగు చూసిన‌ తెలుగు తార‌ల‌ వ్య‌భిచార రాకెట్ వ్య‌వ‌హారం.. ఎంత‌టి ప్ర‌కంప‌న‌లు రేపిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎవ‌రో 10 శాతం మంది తార‌లు న‌డిపే ఇలాంటి త‌క్కువ స్థాయి వ్య‌వహారాలు.. ఒక్కోసారి వాటితో ఏ మాత్రం సంబంధం లేని తార‌ల‌ను ఇబ్బందిలోకి నెట్టేస్తుంటాయి. ఇలాంటి చేదు అనుభ‌వ‌మే అందాల తార మెహ‌రీన్ కౌర్‌కు ఎదురైంది. ‘కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌’, ‘మ‌హానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాల‌తో హ్యాట్రిక్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ తార‌.. అతి త్వ‌ర‌లో ‘పంతం’ సినిమాతో ప‌ల‌క‌రించ‌నుంది. గ‌త కొద్ది రోజులుగా ‘పంతం’ షూటింగ్‌తో బిజీగా ఉన్న మెహ‌రీన్‌.. కొద్ది రోజుల పాటు షూటింగ్‌కు గ్యాప్ రావ‌డంతో అమెరికాలోని అమ్మానాన్న‌ల‌ను క‌లుసుకోవ‌డానికి వెళ్ళారు. తీరా.. ఎయిర్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేష‌న్ అధికారులు తాజాగా వెలుగు చూసిన వ్య‌భిచార రాకెట్ వ్య‌వ‌హారంపై మెహ‌రీన్‌ను ఆరా తీయ‌డంతో ఆమె షాక్‌కు గుర‌య్యార‌ట‌.

తెలుగు సంఘానికి చెందిన ఓ వ్య‌క్తి వ్య‌భిచార రాకెట్ విష‌యంలో అరెస్ట్ అయిన విష‌యం.. వాళ్ళు చెప్పేవ‌ర‌కు తెలియ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా.. త‌ను త‌రుచుగా అమ్మానాన్న‌ల‌కు క‌లుసుకోవ‌డానికి అమెరికా వెళ్తూ ఉంటాన‌ని.. అయితే గ‌తంలో ఈ త‌ర‌హా విచార‌ణ త‌నెప్పుడూ ఎదుర్కోలేద‌ని మెహ‌రీన్ తెలిపారు. దాదాపు అర‌గంట పాటు ఈ విచార‌ణ జ‌రిగింద‌ని.. వారు అడిగే ప్ర‌శ్న‌లు ఇబ్బందిగా అనిపించినా.. ఓపిగ్గా స‌మాధానం చెప్పానని మెహ‌రీన్ తెలిపారు. అమెరికాకు వ‌స్తున్న ప్ర‌తీ తెలుగు ఆర్టిస్ట్‌ని ఈ విష‌యంలో ఎంక్వైరీ చేస్తున్నార‌ని.. త‌ను కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకోవ‌డానినే వ‌చ్చిన‌ట్లుగా చెప్ప‌గానే క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని మెహ‌రీన్ తెలిపారు. ఏదేమైనా ఒక‌రు చేసిన త‌ప్పును.. ఇండ‌స్ట్రీ మొత్తానికి ఆపాదించ‌డం బాధ క‌లిగించింద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె పేర్కొన్నారు. త‌నకు ఎదురైన ఇలాంటి ప‌రిస్థితి.. మ‌రే తార‌కు రాకూడద‌ని కోరుకుంటున్నాన‌ని మెహ‌రీన్ తెలిపారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here