‘పెళ్ళి చూపులు‘ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించిన ఈ బడ్డీ ఎంటర్టైనర్లో విశ్వస్ సేన్, అనీషా అంబ్రోసి, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కకుమాను, అభినవ్ గోమతమ్, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ స్వరకర్త. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ సినిమాకి ‘యు/ఎ‘ సర్టిఫికేట్ జారీ చేసింది. కాగా.. ఈ సినిమా నిడివి 140 నిమిషాలు (2 గంటల 20 నిమిషాలు) ఉంటుందని తెలిసింది. అవుట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
