మ‌రో మెగా హీరోతో హ‌రీష్ శంక‌ర్ చిత్రం

Harish Shankar's next film Kalyan Dev, Harish Sankar's Next Project With Mega Hero, Director Harish Shankar Next Movie Updates, Kalyan Dev Next Movie With DJ Director, Telugu Filmnagar, Latest Telugu Movie News, Telugu Film News 2018, Tollywood Movie Updates
మ‌రో మెగా హీరోతో హ‌రీష్ శంక‌ర్ చిత్రం
‘షాక్’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన హ‌రీష్ శంక‌ర్‌.. ‘మిర‌ప‌కాయ్‌’తో తొలి విజ‌యాన్ని అందుకున్నారు. అయితే.. ఆయ‌న కెరీర్ గ్రాఫ్‌ని అమాంతం పెంచేసిన సినిమా మాత్రం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో తెర‌కెక్కించిన ‘గ‌బ్బ‌ర్ సింగ్’ చిత్ర‌మే. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త‌రువాత హ‌రీష్ శంక‌ర్‌.. టాప్ డైరెక్ట‌ర్‌ల లిస్ట్‌లో చేరిపోయారు. ఆ త‌రువాత మెగా క్యాంప్‌కు చెందిన సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ‘సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్’ తెర‌కెక్కించారు. ‘
‘దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్’ చిత్రం విడుద‌లై ఏడాది దాటినా.. హ‌రీష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నేలేదు.
ఆ మ‌ధ్య ‘దాగుడు మూత‌లు’ పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కించ‌నున్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చినా.. అది వ‌ర్క‌వుట్ కాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సారి కూడా మెగా హీరోతోనే హ‌రీష్ సినిమా చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ రెండో చిత్రాన్ని హ‌రీష్ తెర‌కెక్కించే అవ‌కాశ‌ముంద‌న్న‌దే ఆ వార్త‌ల సారాంశం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌స్తుంది. ఇదిలా ఉంటే.. క‌ళ్యాణ్ తొలి చిత్రం ‘విజేత’ జూలై 12న విడుద‌ల కానుంది.
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here