టిక్ టిక్ టిక్ రివ్యూ

Tik Tik Tik Movie Review,Tik Tik Tik Telugu Movie Review,Tik Tik Tik Review,Tik Tik Tik Movie Rating,Tik Tik Tik Movie Public Talk,Tik Tik Tik Movie Latest News,Jayam Ravi Tik Tik Tik Review,Tik Tik Tik Movie Story,Tik Tik Tik Movie Live Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates
Tik Tik Tik Movie Review

చిత్రం: టిక్: టిక్: టిక్‌

న‌టీన‌టులు: ‘జ‌యం’ ర‌వి, నివేతా పేతురాజ్‌, జ‌య‌ప్ర‌కాష్‌, ఆర‌న్ అజీజ్‌, ర‌మేష్ తిల‌క్‌, విన్సెంట్ అశోక‌న్‌, అర్జున‌న్‌, రిత్వికా శ్రీ‌నివాస్‌, బాలాజీ వేణుగోపాల్‌, మాస్ట‌ర్ ఆర‌వ్ ర‌వి త‌దిత‌రులు

పాట‌లు: వెన్నెల‌కంటి, రాకేందు మౌళి

మాట‌లు: రాజేష్ ఎ.మూర్తి
సంగీతం: డి.ఇమాన్‌

ఆర్ట్ : ఎస్.ఎస్‌.మూర్తి

ఛాయాగ్ర‌హ‌ణం: ఎస్‌.వెంక‌టేష్‌

ఎడిటింగ్‌: ప్ర‌దీప్ ఈ.రాఘ‌వ్‌

నిర్మాత: ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ‌

ద‌ర్శ‌క‌త్వం: శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్‌

విడుద‌ల తేది: జూన్ 22, 2018

ఇండియ‌న్ స్క్రీన్‌పై ఇప్ప‌టివ‌ర‌కు స్పేస్ మూవీ రాలేదు. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ ఇప్పుడు ఓ చిత్రం వ‌చ్చింది. అదే ‘టిక్: టిక్: టిక్‌’. ‘జ‌యం’ ర‌వి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రాన్ని శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ తెర‌కెక్కించారు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘య‌మ‌పాశం’ (త‌మిళంలో ‘మిరుద‌న్‌’).. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తొలి జోంబి మూవీగా రిలీజైంది. మ‌ళ్ళీ అదే కాంబినేష‌న్ భార‌తీయ తెర‌పై తొలి అంత‌రిక్ష చిత్రంతో ప‌ల‌క‌రించింది. శుక్ర‌వారం తెర‌పైకి వ‌చ్చిన ‘టిక్: టిక్: టిక్‌’ సినిమాపై ‘తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌.కామ్’ అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థాంశం

విశాఖపట్నం తీర ప్రాంతంలో అక‌స్మాత్తుగా అంతరిక్షం నుండి ఒక ఉల్క నిప్పులు గక్కుతూ దాడి చేస్తుంది. 8 చదరపు అడుగులు ఉన్న ఆ ఉల్క తీరని నష్టాన్ని కలిగిస్తుంది. మరో ఏడు రోజుల్లో 60 కి.మీ. చదరపు అడుగులున్న మరో ఉల్క భూమిపైకి దాడి చేయబోతోందని డి.ఎస్‌.డి (డిఫెన్స్ స్పేస్ డివిజ‌న్‌)కి తెలుస్తుంది. దీనివలన కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు ముప్పు పొంచి ఉందని డి.ఎస్‌.డి గ్రహిస్తుంది. ఈ విషయం బయటకి తెలిస్తే ప్రజలు భయాందోళనలకు గురవుతారని భావిస్తుంది డి.ఎస్.డి. అయితే.. ప్ర‌త్యామ్నాయంగా ఈ ఉల్క‌ను నాశ‌నం చేయాలంటే 200 కిలోల టన్నుల న్యూక్లియర్ మిస్సైల్ కావాల్సి వస్తుంది. అది ఓ స్పేస్ స్టేషన్‌లో ఉన్న ఒక‌ స‌ప‌రేటెడ్ వాల్ట్‌లో ఉంటుంది. ఆ మిస్సైల్‌ను దొంగతనం చేయడం తప్ప వేరే దారిలేదని నిర్ణయం తీసుకుంటుంది డి.ఎస్.డి బృందం. ఈ దొంగతనానికి ఎంతో నైపుణ్యం ఉన్న దొంగ కోసం ఎదురుచూస్తున్న సందర్భంలో.. వాసుదేవ్‌ అనే ట్రైనెడ్ మెజీషియ‌న్‌ గురించి తెలుస్తుంది. గాలి ప్ర‌వేశించ‌లేనిచోట కూడా ప్ర‌వేశించగ‌ల నేర్పు ఇత‌ని సొంతం. అన్ని విధాలా ప‌రిశీలించాకే.. చీమ‌ కూడా చొరబడ‌లేనంత కట్టుదిట్టమైన భ‌ద్రత కలిగిన ఆ వాల్ట్‌లోకి వాసుని పంపడానికి సిద్ధపడతాడు డి.ఎస్‌.డి చీఫ్ మ‌హేంద్ర‌న్ (జ‌య‌ప్ర‌కాష్‌). ఇందుకు వాసును కూడా ఒప్పిస్తారు. అంతేగాకుండా.. వాసుకు, అత‌ని స్నేహ‌బృందానికి ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా ఇస్తారు. డి.ఎస్‌.డి టీమ్‌తో పాటు వాసు బృందం కూడా ఈ ఆప‌రేష‌న్‌లో భాగ‌మ‌వుతారు. మ‌రి.. అనుకున్న‌ట్లుగానే వాసు ఆ మిస్సైల్‌ను దొంగ‌లించ‌గ‌లిగాడా? అలాగే వారం రోజుల్లో భూమి పైకి రాబోయే ఆ ఉల్కను నాశనం చేయగలిగాడా? లేదా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అస‌లు.. డి.ఎస్‌.డి చీఫ్ ఈ మిష‌న్‌కు వాసునే ఎందుకు ఎంచుకున్నాడు? అనేది కూడా కీల‌కాంశ‌మే.

విశ్లేష‌ణ‌

స్పేస్‌కు సంబంధించిన క‌థ‌ను తొలిసారిగా ఇండియన్ స్క్రీన్‌పై ఆవిష్కరించిన‌ దర్శకుడు శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ అభినందనీయుడు. ఎంతో చక్కగా రాసుకున్న‌ కథను.. అంతే చక్కగా ఎగ్జిక్యూట్‌ చేయడంలో సఫలీకృతులయ్యారాయ‌న‌. క‌థానాయ‌కుడి ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌, మిస్సైల్‌ను దొంగ‌తనం చేసే సీన్స్ ఉత్కంఠ‌భ‌రితంగా చిత్రీక‌రించారు. అలాగే క‌థానాయ‌కుడికి, అత‌ని కొడుకుకి మ‌ధ్య సాగే సన్నివేశాలను హార్ట్ ట‌చింగ్‌గా పిక్చ‌రైజ్ చేశారు. అలాగే ‘క‌న్న‌య్య’ పాటలో ‘జ‌యం’ ర‌వికి, అత‌ని కొడుకు మ‌ధ్య అనుబంధాన్ని చూపించ‌డం కోసం.. వారి రియ‌ల్ లైఫ్‌లోని వీడియోల‌ను వాడుకోవ‌డం బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఈ ఆలోచ‌న‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేం. క‌థానాయ‌కుడిని, అత‌ని స్నేహితుల‌ను అంత‌రిక్షంలో పంప‌డం కోసం ట్రైనింగ్ ఇచ్చే సీన్స్ ఫ‌న్నీగా ఉంటాయి. గ్రావిటీ లేని చోట క‌న్నీటి చుక్క‌, మందు తాగ‌డం.. త‌దిత‌ర విష‌యాల‌ను చాలా స‌హ‌జంగా చిత్రీక‌రించారు. ఓవ‌రాల్‌గా.. తొలి స్పేస్ మూవీని చ‌క్క‌టి క‌థ‌తో, క‌థ‌నంతో, స‌న్నివేశాల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. ‘జ‌యం’ ర‌వి త‌న పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. కొడుకుతో సాగే స‌న్నివేశాల్లో స‌హ‌జంగా న‌టించాడు. దానికి తోడు సొంత కొడుకే కావ‌డంతో.. ఆ కెమిస్ట్రీ మ‌రింత వ‌ర్క‌వుట్ అయ్యింది. అలాగే నెగెటివ్ ట‌చ్ ఉన్న డి.ఎస్‌.డి చీఫ్ పాత్ర‌లో జ‌య‌ప్ర‌కాష్ న‌ట‌న బాగుంది. క‌థానాయ‌కుడి స్నేహితులుగా ర‌మేష్ తిల‌క్‌, అర్జున‌న్ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. నివేతా పేతురాజ్ న‌ట‌న స్కోప్ ఉన్న పాత్ర‌లో మెప్పించింది. మాస్ట‌ర్ ఆర‌వ్ ర‌వి క్యూట్‌గా ఉన్నాడు. మిగిలిన వారంతా త‌మ ప‌రిధిలో మెప్పించారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. డి.ఇమాన్ సంగీతంలో “కన్నయ్యా” పాట వినడానికే కాకుండా చూడ‌డానికి కూడా బాగుంది. నేప‌థ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఒక స్పేస్ సినిమాకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలో.. ఆ త‌ర‌హా మ్యూజిక్‌ను అందించారు ఇమాన్. ఎస్‌.వెంక‌టేష్‌ కెమెరా వ‌ర్క్ బాగుంది. అలాగే గ్రాఫిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

కాన్సెప్ట్

విజువల్స్

నేపథ్య సంగీతం

డైరెక్షన్

పెర్ఫార్మన్స్

నిర్మాణ విలువలు

మైన‌స్ పాయింట్స్‌

స‌గ‌టు ప్రేక్ష‌కులు కోరుకునే వినోదం లేక‌పోవ‌డం

లిమిటెడ్ అప్పీల్

చివ‌ర‌గా:  భార‌తీయ తెర‌పై కొత్త ప్ర‌య‌త్నం

టిక్ టిక్ టిక్ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performances
3.3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here