తొలి త‌రం సినీ పాత్రికేయులు నంద‌గోపాల్ క‌న్నుమూత‌

Nadella Nanda Gopal Passed Away, Senior Journalist Nadella Nanda Gopal No More, Nadella Nanda Gopal Passes Away, Journalist Nadella Nanda Gopal Biography, Best Film Critic Nanda Gopal RIP, Best Film Journalist Nanda Gopal Latest News, Telugu Filmnagar, Latest Telugu Movie News, Telugu Film News 2018, Tollywood Movie Updates
Nadella Nanda Gopal Passed Away

ప్ర‌ఖ్యాత ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్‌, సంపాద‌కులు, `ఉత్త‌మ సినీ పాత్రికేయ‌డు`గా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అవార్డుల‌తో పాటు అనేకానేక ఘ‌న పుర‌స్కారాల‌ను సొంతం చేసుకున్న సినీ ఘ‌నాపాటి నాదెళ్ళ నంద‌గోపాల్ (86)  ఈ రోజు హైద‌రాబాద్‌లో క‌న్ను ముశారు. సినీ పాత్రికేయుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌తో 60 సంవ‌త్స‌రాల‌కు పైగా అనుబంధం క‌లిగిన నంద‌గోపాల్‌ను `తొలి త‌రం సినీ పాత్రికేయ‌డి`గా చిత్ర ప‌రిశ్ర‌మ విశేషంగా గౌర‌విస్తుంది. త‌న సుదీర్ఘ పాత్రికేయ జీవితంలో వేలాది వ్యాసాలు, ఇంట‌ర్వ్యూలు రాసి ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో మెప్పు పొందిన నంద‌గోపాల్  `సినిమాగా సినిమా` పుస్త‌కం ద్వారా కేంద్ర  , రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ నుండి `బెస్ట్ బుక్ ఆన్ ఫిల్మ్స్` అవార్డు అందుకున్నారు.

విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ ఎన్‌.టి.రామారావు ముఖ్య‌మంత్రి అయ్యాక.. ఆయ‌న ప‌ర్స‌న‌ల్ పీఆర్‌వోగా ప‌నిచేయ‌డ‌మే కాకుండా తెలుగు దేశం ప్ర‌భుత్వం  ప్రారంభించిన ప్ర‌భుత్వం తొలి స‌మాచార ప‌త్రిక‌ `తొలి వెలుగు`కు వ్య‌వ‌స్థాప‌క సంపాద‌కుడిగా  ప‌నిచేసిన ఘ‌న‌త నాదెళ్ళ‌ నంద‌గోపాల్‌కు ద‌క్కింది. అలాగే ఎన్టీఆర్‌, అక్కినేని, దాస‌రి నారాయణ‌రావు, రామానాయుడు,కె.ఎస్‌.రామారావు త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులకు అత్యంత స‌న్నిహితుడైన నంద‌గోపాల్ సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్‌గా అనేక ప‌ర్యాయాలు ప‌నిచేశారు. ఆయ‌న‌కు భార్య క‌ల్ప‌న‌, కుమారులు గోపీచంద్‌, ప్ర‌త్యగాత్మ‌, కుమార్తె క‌విత ఉన్నారు. రేపు హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మ‌హా ప్ర‌స్థానంలో అంత్య‌క్రియలు జ‌రుగుతాయ‌ని కుమారులు తెలియ‌జేశారు.
తన సుదీర్ఘ ప్ర‌స్థానంలో నంద‌గోపాల్ సాధించిన విజ‌యాలు, అందుకున్న అవార్డుల వివ‌రాలు..

 

 

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here