విజ‌య్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ చిత్రం పేరేంటంటే

Sarkar First Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Sarkar Movie First Look,Sarkar Telugu Movie First Look,Sarkar Movie Updates,Sarkar Telugu Movie Latest News

‘తుపాకి’, ‘క‌త్తి’ (‘ఖైదీ నంబ‌ర్ 150’కి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌) చిత్రాల‌తో సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌గా పేరు తెచ్చుకున్న త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్‌, స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌. మురుగ‌దాస్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను రేపు (శుక్ర‌వారం) విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు విడుద‌ల చేశారు. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. విజ‌య్‌తో రూపొందించిన గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఈ సినిమాని కూడా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ స్టైలిష్‌గా తెర‌కెక్కించార‌ని పోస్ట‌ర్ చూస్తే ఇట్టే అర్థ‌మైపోతోంది. దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాద‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here